సాక్షి లైఫ్ : ప్రపంచ కాలేయ దినోత్సవం నేడు ప్రపంచ కాలేయ దినోత్సవం. దేశంలో ప్రతి పది మంది పెద్దవారిలో ఒకరు కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. అంతేకాదు ఫ్యాటీ లివర్ సమస్యలుఉన్న వారి సంఖ్య మరింతగా పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు తమ ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వైద్యులు కూడా ప్రజలకు ఇదే సలహా ఇస్తున్నారు.
లక్షణాలు కనిపించకపోవడం వల్ల..
ప్రారంభదశలో లక్షణాలు కనిపించకపోవడం వల్ల, పెద్ద సంఖ్యలో రోగులు లివర్ సిర్రోసిస్, కాలేయ క్యాన్సర్‌కు గురవుతున్నారు. జంక్ ఫుడ్, పదే పదే వేడిచేసిన నూనెలో వేయించిన వంటకాలు, ప్రిజర్వేటివ్స్, కార్బోనేటేడ్ డ్రింక్స్ కాలేయ వ్యాధులకు కారణమవుతు న్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
భారత్ లోని ప్రతి 10 మంది పెద్దలలో ఒకరు కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఇందులో దాదాపు 60 శాతం మంది రోగులు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధితో బాధపడుతున్నారు. ప్రారంభ దశలో వ్యాధి లక్షణాలు కనిపించకపోవడం వల్ల లివర్ సిర్రోసిస్ వంటి తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు గురవుతున్నారు.
పాశ్చాత్య జీవనశైలి..
దీనికి అతిపెద్ద కారణం పాశ్చాత్య జీవనశైలి అంటే ప్రతిచోటా లభించే ఆహారం, జీవనశైలి అలవాట్లు. ఇంతకుముందు ఈ వ్యాధి పాశ్చాత్య దేశాలలో ఎక్కువగా ఉండేది. అయితే గత 15 ఏళ్లలో ఆయా దేశాల్లో తగ్గింది. భారతదేశంలో మాత్రం వేగంగా పెరుగుతోంది.
ఫ్యాటీ లివర్..
ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు, ట్రైగ్లిజరైడ్స్ ,మధుమేహం ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ముఖ్యమైన కారకాలు. తినే ఆహారంలో అధిక కొవ్వును తీసుకుంటే, అది కాలేయంలో పేరుకుపోవడం ప్రారంభమ వుతుంది. తద్వారా అది వాస్తుంది. దీనిని ఫ్యాటీ లివర్ అంటారు.
కాలేయ వైఫల్యం..
కాలేయం కొత్త కణాలను సృష్టించడం ద్వారా స్వయంగా మరమ్మత్తు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కానీ అలవాట్లు మెరుగుపడకపోతే, దెబ్బతిన్న కణాల సంఖ్య పెరుగుతుంది. ఈ పరిస్థితిని లివర్ సిర్రోసిస్ అంటే కాలేయ వైఫల్యం అంటారు. ఆహార పదార్థాల రుచిని పెంచడానికి అజినోమాటో, ఎక్కువ సమయం నిల్వ ఉంచేందుకు వేసే ప్రిజర్వేటివ్స్, అందంగా కనిపించేందుకు కృత్రిమ రంగులు, అదే నూనెను పదే పదే వేడి చేసి తయారుచేసే వంటకాలు కాలేయ క్యాన్సర్ ముప్పును పెంచుతున్నాయి.
25 శాతం మంది..
ప్రపంచ జనాభాలో 25 శాతం మంది కాలేయ వ్యాధుల బారిన పడుతున్నారని పరిశోధకులు చెబుతున్నారు. దేశంలో ప్రతి 10 మందిలో ఒక రోగి ఉన్నట్లు అంచనా. ప్రతి 10 మంది కొవ్వు కాలేయ రోగులలో ఇద్దరికి లివర్ సిర్రోసిస్ ఉంటుంది. హెపటైటిస్ బి , సి లివర్ సిర్రోసిస్‌గా మారకపోతే చికిత్స చేయవచ్చు, అయితే ఆహారం, వ్యాయామం ద్వారా మాత్రమే కొవ్వు కాలేయాన్ని నయం చేయవచ్చు.
వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి..?
అలసట-బరువు తగ్గడం, ఆకలి మందగించడం, వికారం, ఏకాగ్రత తగ్గడం, కడుపు పైభాగంలో లేదా మధ్య భాగంలో నొప్పి, మెడ, చేతుల కింద నల్లటి మచ్చలు, ముఖంలో కొద్దిగా వాపు, కామెర్లు, దురద, నోటి చుట్టూ దద్దుర్లు మొదలైనవి ఉన్నప్పుడు తప్పనిసరిగా డాక్టర్ ను సంప్రదించాలి.
కాలేయ వ్యాధులు రాకుండా..
అదనపు కార్బోహైడ్రేట్లు, అదనపు కొవ్వు, జంక్ ఫుడ్, కార్బోనేటేడ్ శీతల పానీయాలు తీసుకోవద్దు. తృణధాన్యాలు, చిక్కుళ్ళు, గింజలు, బీన్స్, తాజా పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు, ఆలివ్ నూనె, సుగంధ ద్రవ్యాలు, మూలికలు వంటి ఎక్కువ ప్రోటీన్లను తినండి. వారానికి ఐదు రోజులు 40 నిమిషాలు నడవాలి. తద్వారా శరీరంలో కొవ్వు పెరగదు.
ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com