మైగ్రేన్ పెయిన్ కు కారణాలివే..

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మనం ప్రతిరోజూ అనుసరించే ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు కొన్నిరకాల అనారోగ్య సమస్యలు తలెత్తడానికి దారితీస్తుంటాయి. అటువంటి వాటిని గురించి తెలుసుకొని ఆయా జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యంగా ఉండొచ్చు. ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకూ అనేక రకాల ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉంటాం. వాటి వల్ల తలెత్తే అనారోగ్య సమస్యలను గురించి ముందుగా తెలుసుకుంటే జాగ్రత్త పడొచ్చు. మైగ్రేన్ పెయిన్ కూడా సరిగ్గా అలాంటిదే. ఈ పెయిన్ రావడానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఎక్కువగా కాఫీ తాగడం, అధికంగా మద్యం తీసుకోవడం, ఒత్తిడి గురికావడం, ఎక్కువ లైటింగ్లో ఉండడం, పెద్ద పెద్ద ధ్వనులు వినడం, నిద్ర విధానంలో మార్పులు, మహిళల్లో హార్మోన్ల మార్పుల కారణంగా, తీవ్రమైన శారీరక శ్రమ, సమయానికి భోజనం చేయకపోవడం, ఆహారంలో ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల, ప్రాసెస్ చేసిన ఆహారాలు తినడం కొన్ని మందుల దుష్ప్రభావాల కారణంగా వాతావరణంలో మార్పు వల్ల బాగా అలసిపోయినట్లుగా ఉండడం పర్ఫ్యూమ్స్ ఎక్కువగా వాడడం పొగ తాగడం వల్ల ఈ కారణాల వల్ల మైగ్రేన్ సమస్య తలెత్తే అవకాశం ఉంది. మైగ్రేన్ ను ప్రేరేపించే కారకాలను బట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆ పెయిన్ రాకుండా ఉండొచ్చు.

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.