పంటి నొప్పికి కారణాలు..పరిష్కార మార్గాలు..?
సాక్షి లైఫ్ : చలికాలంలో విపరీతమైన చలి ఉంటుంది. దీని కారణంగా దంతాలు సున్నితంగా మారుతాయి. దీనివల్ల దంతాలు చిట్లి పోతాయి. ఐస్ క్రీం తిన్నప్పుడు ఓ రకమైన నొప్పి కలుగుతుంది. అప్పుడు చల్లదనం కారణంగా దంతాలు సున్నితంగా మారి నొప్పిగా అనిపిస్తాయి. వేడిగా లేదా చల్లగా ఏదైనా తినడం వల్ల దంతాలకు హాని కలుగుతుందా..? అంటే అవునని అంటున్నారు వైద్య నిపుణులు. పంటి ఎనామెల్ క్షీణించినప్పుడు లేదా చిగుళ్ల బలం తగ్గినప్పుడు సహజంగా దంతాలునొప్పిగా అనిపిస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. చల్లదనం కారణంగా దంతాలు సున్నితంగా మారతాయి.
ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
చల్లని వాతావరణం దంతాలను దెబ్బతీస్తుందా..?
అవును, చల్లని వాతావరణం దంతాలను దెబ్బతీస్తుంది. దంతాలు విపరీతమైన వేడి లేదా, చలికి కుదించుకుపోతాయి. కాలక్రమేణా దంతాలలో పగుళ్లు ఏర్పడతాయి. దీంతో దంతాలు పుచ్చుతాయి, అంతేకాదు చిగుళ్ల వ్యాధి తలెత్తి పంటి నొప్పి వస్తుంది.
ఎనామిల్ కింద ఉండే పొరను డెంటిన్ అంటారు. ఎనామెల్ దెబ్బతినడం వల్ల పంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
దంతాలను ఎంత జాగ్రత్తగా చూసుకున్నా వాతావరణ సున్నితత్వం మిమ్మల్ని బాధపెడుతుంది. అంతేకాదు నోటి పరిశుభ్రతను పాటించకపోతే ఎక్కువ ప్రమాదం ఉంటుంది.
గట్టిగా బ్రష్ చేయడం..
గట్టిగా బ్రష్ చేయడం వల్ల దంతాల ఎనామెల్ పాడవుతుంది. కాబట్టి గాట్టిగా కాకుండా సున్నితంగా పండ్లు తోమడం మంచిదని డాక్టర్లు చెబుతున్నారు.
కొంతమంది నిద్రిస్తున్నప్పుడు పళ్ళు బిగించడం లేదా కొరకడం చేస్తుంటారు. దీని కారణంగా దంతాల ఎనామెల్ దెబ్బతిని సున్నితత్వానికి దారితీస్తుంది.
ఈ అలవాట్లను మానేయండి..
ఆమ్ల పానీయాలు: సోడా, కాఫీ, టీ , జ్యూస్ వంటి అధిక మొత్తంలో యాసిడ్ కలిగి ఉన్న పానీయాలు దంతాలకు హాని చేస్తాయి.
పొగాకు ఉత్పత్తులను ఉపయోగించడం లేదా సరిగ్గా బ్రష్ చేయకపోవడం లేదా ఫ్లాసింగ్ చేయకపోవడం వంటి అలవాట్లు దంతాల సమస్యలను పెంచుతాయి.
ఫ్లోరైడ్ అప్లికేషన్..
ఫ్లోరైడ్ అనేది సహజమైన ఖనిజం, దంతవైద్యుడు దంతాలకు అప్లై చేయమని సూచిస్తాడు. ఇలా అప్లై చేయడం వల్ల ఎనామెల్ బలంగా ఉంటుంది. తద్వారా డెంటిన్ వల్ల కలిగే సున్నితత్వాన్ని నిరోధిస్తుంది.
రూట్ కెనాల్ చికిత్స..
రూట్ కెనాల్ ప్రక్రియలో, దంతవైద్యుడు దెబ్బతిన్న పంటి లోపల మృదువైన గుజ్జును తొలగిస్తాడు. విరిగిన దంతాలను తొలగించి అవసరమైన పరిష్కారాలు అందిస్తారు.
ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?
ఇది కూడా చదవండి..లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి..నడక, పరుగు.. ఈ రెండిటిలో ఏది ఉత్తమం..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
