సర్వైకల్ నొప్పి లక్షణాలు ఎలా ఉంటాయి..?
సాక్షి లైఫ్ : నేటి బిజీ లైఫ్‌లో అస్తవ్యస్తమైన రోజువారీ దినచర్య, సరైన భంగిమలో పడుకోకపోవడం, కూర్చొని నిరంతరం పని చేయడం కారణంగా మెడ నొప్పి సమస్య వచ్చినట్లుగా భావించడమేకాకుండా, పనిభారం వల్ల అలసిపోయాము. అందుకే ఇలా జరుగుతోందని ఇలాంటి నొప్పిని విస్మరిస్తారు కొందరు. కానీ ఈ లక్షణాలన్నీ సర్వైకల్ నొప్పికి సంబంధించినవేనని మీకు తెలుసా..? దానిని నిర్లక్ష్యం చేయడం వల్ల సమస్య మరింత పెరుగుతుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
సర్వైకల్ నొప్పి లక్షణాలు..
మెడ వద్ద వాపు, మెడ గట్టిపడడం.
మెడ కండరాల నొప్పి
నిరంతరం తలనొప్పి
చేతులు, కాళ్ళలో జలదరింపు సమస్య
మెడ తిప్పితే శబ్దం రావడం
వాంతి వచ్చినట్లు అనిపించడం
ఇది కూడా చదవండి.. భారతీయ ఆహార మార్గదర్శకాలను విడుదల చేసిన ఎన్ఐఎన్
ఇది కూడా చదవండి.. ఆక్యుపంచర్ చికిత్సలో సైడ్ ఎఫెక్ట్స్..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
