మేనరికం పెళ్లిళ్లు: పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
సాక్షి లైఫ్ : దగ్గరి బంధువుల మధ్య జరిగే వివాహాల వల్ల జన్యుపరమైన లోపాలు సంక్రమించే ప్రమాదం పెరుగుతుంది. తల్లిదండ్రులిద్దరికీ ఒకే రకమైన జన్యు లోపం ఉన్నట్లయితే, పుట్టబోయే పిల్లలకు ఆ లోపం సంక్రమించే అవకాశం గణనీయంగా పెరుగుతుంది. దగ్గరి బంధువుల మధ్య పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల ఎలాంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వస్తాయి..?
ఇది కూడా చదవండి.. For health : కుంకుమ పువ్వు"టీ"తో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి..?
ఇది కూడా చదవండి.. నల్ల ఉప్పుతో ఆరోగ్య ప్రయోజనాలివే
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
ఆధునిక సమాజంలో బంధుత్వ వివాహాలపై చర్చ తీవ్రమవుతోంది. సాంప్రదాయాలు, సామాజిక కారణాల వల్ల దగ్గరి బంధువుల మధ్య వివాహాలు సర్వసాధారణంగా జరుగుతుంటాయి. అయితే, ఇలాంటి వివాహాల వల్ల పుట్టబోయే పిల్లలకు కొన్ని దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిపై అవగాహన లేకపోవడం వల్ల అనేక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి.
దగ్గరి బంధువుల మధ్య పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావచ్చు? రాకముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? అనే అంశాలను గురించి ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఫెటల్ మెడిసిన్ రిప్రొడక్టివ్ జెనిటిక్స్ డైరెక్టర్ డా. బూరగడ్డ శ్రీనాథ్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియోలో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి.. మీరు 40 ఏళ్లు పైబడినవారా..? ఈ 5 పరీక్షలు చేయించుకోండి..
ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
