For health : కుంకుమ పువ్వు"టీ"తో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి..?

సాక్షి లైఫ్ : ప్రపంచవ్యాప్తంగా చాలా మంది టీ తాగడానికి ఇష్టపడతారు. సాధారణంగా చాలామంది పాలతో చేసిన టీ తాగడానికి ఆసక్తి చూపుతారు. కుంకుమ పువ్వుతో తయారుచేసిన టీ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను గురించి మీకు తెలిస్తే అస్సలు వదలరు. ఈ టీ మిమ్మల్ని అనేక అనారోగ్య సమస్యల నుంచి రక్షిస్తుంది. కుంకుమపువ్వు  టీ తాగడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి.. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?  

ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..? 

 

కుంకుమ పువ్వు టీతో ఆరోగ్యానికి ఎంతో మేలు..  

నేటి బిజీ జీవితంలో చాలామంది తమ ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోలేక పోతున్నారు. అటువంటి పరిస్థితిలో ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన వాటి కోసం ఎదురు చూస్తారు, దీనికోసం, భారతీయ వంటగదిలో లభించే  అనేక సుగంధ ద్రవ్యాలు హెల్తీగా ఉంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఆరోగ్యానికి వీటిని వరంలా భావిస్తారు. అటువంటి వాటిలో కుంకుమ పువ్వు ఒకటి. కుంకుమ పువ్వు అనేది క్రోకస్ సాటివస్ లిన్నే పువ్వుల నుంచి వచ్చే సుగంధ ద్రవ్యం. ఇది ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిని ఏ విధంగా ఆహారంలో చేర్చినా, అది ప్రయోజనం చేకూరుస్తుంది.  
 

రోగనిరోధక శక్తి.. 

కుంకుమ పువ్వులో యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి మన శరీర రోగనిరోధక శక్తిని పెంచడానికి పనిచేస్తాయి. సీజన్ సమయంలో జలుబు లేదా వైరల్ ప్రమాదం ఉన్నప్పుడు, కుంకుమపువ్వు టీ శరీరానికి లోపల నుంచి బలాన్ని ఇస్తుంది. ప్రతిరోజూ ఉదయం ఈ "టీ" తాగవచ్చు. లేదంటే రాత్రి పడుకునే ముందు కూడా తీసుకోవచ్చు.

సహజ కాంతి.. 

కుంకుమ పువ్వు టీ తాగడం వల్ల చర్మం మెరుస్తుంది. కుంకుమపువ్వులో విటమిన్ బి ఉంటుంది, ఇది చర్మ ఆకృతిని మెరుగుపరిచి, చర్మాన్ని ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది.

మానసిక ఉత్తేజం.. 

నిరంతరం ఒత్తిడి లేదా ఆందోళనలో ఉంటే, కుంకుమపువ్వు టీ మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కుంకుమపువ్వులో ఉన్న లక్షణాలు మనస్సుకు విశ్రాంతినిస్తాయి. మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. కుంకుమపువ్వు నిరాశ ,ఆందోళనలను కూడా తగ్గిస్తుంది.

మెరుగైన కంటి చూపునకు.. 
 
చూపు మందగించిన వారికి కుంకుమపువ్వు "టీ" తాగడం అనేది సరైన పరిష్కార మార్గం. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇతర వ్యాధులను కూడా దూరంగా ఉంచుతుంది. అయితే, కుంకుమపువ్వు "టీ" పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి.  

ఇది కూడా చదవండి..ఓరల్ క్యాన్సర్ కు కారణాలు..? 

ఇది కూడా చదవండి..సహజంగా ఆక్సిటోసిన్ పెంచడానికి మార్గాలు.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : saffron health-benefits-of-saffron saffron-healthbenefits saffron-benefits benefits-of-saffron saffron-tea-benefits health-benefits-of-saffron-tea saffron-tea-for-mood saffron-tea-for-depression saffron-tea-for-anxiety saffron-tea-for-weight-loss saffron-tea-for-heart-health saffron-tea-for-pms saffron-tea-for-memory saffron-for-cognitive-function saffron-and-cancer saffron-for-sleep saffron-for-digestion saffron-for-blood-sugar saffron-for-libido saffron-and-immunity crocus-sativus
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com