ఇలాంటి రాష్ట్రాల్లోనే మధుమేహం కేసులు ఎక్కువ..
సాక్షి లైఫ్ : మధుమేహ వ్యాధి కేవలం పెద్దల్లోనే కాదు.. పసిపిల్లల్లో సైతం వస్తోంది. అసలు మధుమేహం రావడానికి ప్రధాన కారణాలు ఏంటి..? ఎలాంటివాళ్లలో ఏ ఏ కారణాల వల్ల మధుమేహంపై అవగాహన కల్పించడంపై దృష్టి సారించారు పరిశోధకులు. దేశంలోని ఎనిమిది ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రాలకు (ఆర్సిసి) అనుసంధానించిన 205 కేంద్రాల నుంచి 5,546 మంది పాల్గొన్నారు.
ఇందులో 49.5 శాతం పురుషులు, 50.5 శాతం మహిళలు పాల్గొనగా ఈ అధ్యయనంలో టైప్ 1, టైప్ 2 మధుమేహం ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. ఈ అధ్యయనం 2006లో ప్రారంభించగా, ఇప్పటికీ కొనసాగుతోంది.
దేశంలో 31.5 కోట్ల మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు.
ఐసిఎంఆర్ ఇండియా డయాబెటిస్ స్టడీ భారతదేశంలోని ప్రతి రాష్ట్రం నుంచి 1.2 లక్షల మంది డేటా కలిగి ఉంది. దేశంలో 31.5 కోట్ల మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని, 35.1 కోట్ల మంది ఊబకాయంతో బాధపడుతున్నారని అధ్యయనం వెల్లడించింది. తక్కువ అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో మధుమేహం ముప్పు పెరుగుతోందని అధ్యయనం సూచించింది. భారతీయుల్లో 10 శాతం కంటే తక్కువ మంది శారీరక శ్రమల ద్వారా తమ శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..థ్రోంబోసైట్లు అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
