ఊపిరితిత్తులను సంరక్షించే పండ్లు.. తెలుసా..?
సాక్షి లైఫ్ : కొన్నిరకాల పండ్లు ఊపిరితిత్తులకు పోషకాలు అందించడమే కాకుండా, శ్వాస సంబంధిత సమస్యల నివారణలోనూ సహాయపడతాయి. ఎలాంటి పండ్లు మన ఊపిరిత్తులను సంరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి..? అందుకోసం ఏమేం పండ్లు తీసుకోవాలి..? ఊపిరిత్తులు శరీరంలో ఆక్సిజన్‌ను తీసుకుని కార్బన్ డయాక్సైడ్‌ను బయటకు పంపించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
ఇది కూడా చదవండి..తక్కువ బరువు లేదా అధిక బరువు శిశువు ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది..?
ఇది కూడా చదవండి..30 ఏళ్ల తర్వాత శరీరానికి కొల్లాజెన్ ఎందుకు ముఖ్యమంటే..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు
శరీరంలో ఇవి ముఖ్యమైన అవయవాలు. ఇవి శ్వాసక్రియ విషయంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఊపిరిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఊపిరిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కొన్నిరకాల పండ్లు ఎంతో మేలు చేస్తాయి. ఈ రెండు రకాల పండ్లకు ఊపిరితిత్తులను రక్షించే శక్తి ఉంది. అవేంటంటే..?
రుగ్మతలు..
టమాటాలు-యాపిల్స్ ఊపిరితిత్తులను రక్షించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని తాజా అధ్యయనం కనుగొంది. యాపిల్స్, టమాటాలు తిన్నవారిలో ఊపిరితిత్తులకు సంబంధించిన రుగ్మతలను పరిష్కరిస్తాయని అధ్యయనం ద్వారా పరిశోధకులు గుర్తించారు. రోజుకు రెండు టమాటాలు లేదా మూడు ఆపిల్ పండ్లను తిన్న వారితో పోలిస్తే వారి ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడిందని అధ్యయనం కనుగొంది. టమాటాలను ఎక్కువగా తినేవారికి ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
సాధారణంగా 35 ఏళ్ల తర్వాత, ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయి. ఆపిల్ , టమాటా పండ్లను ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో భాగం చేసుకోవడమే దీనికి చక్కటి పరిష్కారమని అధ్యయనం సూచిస్తుంది. ఇది ధూమపానం వల్ల కలిగే సమస్యలను కూడా ఎదుర్కోగలదని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. డెంగ్యూ సమయంలో ప్లేట్‌లెట్ల కౌంట్ ను ఎలా పెంచాలి..?
ఇది కూడా చదవండి..హార్మోనల్ ఇంబ్యాలెన్స్ విషయంలో అమ్మాయిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
