వీగన్ డైట్‌తో నష్టాలు కూడా ఉన్నాయా..?
సాక్షి లైఫ్ : వీగన్ డైట్ అనేది శాకాహారం లాంటిదే. కాకపోతే కొద్దిపాటి మార్పులుంటాయి.ఈ డైట్ విషయంలో శాఖాహార ఆహారాన్ని, మాంసాహారాన్ని తీసుకోరు. కానీ శాకాహారులుగానే పరిగణిస్తారు. వీగన్ డైట్ ఫాలో అయ్యేవాళ్ళు మొక్కల ఆధారిత ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు. మాంసం, చేపలు, గుడ్లు వంటి వాటితోపాటు జంతు ఆధారిత ఆహారాలకు దూరంగా ఉంటారు. అంతేకాదు జెలటిన్ వంటి జంతువుల ఉపఉత్పత్తులను కూడా అస్సలు ముట్టుకోరు. మరి కొంతమంది తేనెనుకూడా తీసుకోరు.
ఆరోగ్య ప్రయోజనాల కోసం కొందరు వీగన్ ఫుడ్ ను ఎంచుకున్నప్పటికీ, వీరి మెనులో శరీరానికి కావాల్సిన అన్నిరకాల పోషకాలు అందక పోవచ్చు.
వీగనిజం పాటించే వాళ్లు ముఖ్యంగా కఠినమైన ఆహార పద్దతులను పాటిస్తారు. కేవలం మొక్కల ద్వారా లభించే ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు. కాబట్టి దీనిని అనుసరించేవారిలో కొందరికి పోషకాహార లోపం తలెత్తవచ్చు.
వీగన్ డైట్‌తో నష్టాలు..
-వీగన్ డైట్‌తో ఎన్నో లాభాలున్నప్పటికీ కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. వీగన్ ఫుడ్ తీసుకునేవారికి ఐరన్ సమస్యలు వచ్చే అవకాశముంది.
- వీగన్స్‌లో ప్రొటీన్లు, కాల్షియం, విటమిన్ B12 పోషకాల లోపం ఉండే అవకాశం ఉంది.
- చాలా మంది శాకాహారులు ఐరన్ లోపంతో రక్తహీనతకు గురయ్యే ప్రమాదం ఉంది.
నాన్ వెజిటేరియన్స్, వీగన్స్ ఎవరైనా సరే.. ఎలాగ మారినా తమ శరీర తత్వాన్ని బట్టి డైట్‌ను ఫాలో అవ్వాలి. శృతి మించితే లేనిపోని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. కాలుష్య కోరల నుంచి ఎలా బయట పడాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
