కాలుష్య కోరల నుంచి ఎలా బయట పడాలంటే..?
సాక్షి లైఫ్ : పల్లె ,పట్నం అనే తేడాల్లేకుండా వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. కాలుష్యం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యల ముప్పు పెరగడమేకాకుండా ప్రాణాలు కోల్పోతున్నారు. కాలుష్య కోరల నుంచి ఎలా బయట పడాలి..? అందుకోసం ఎలాంటి చిట్కాలను పాటించాలి..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
మీ ఇంట్లో హై ఏపీసెన్సీ పర్టిక్యులేట్ అబ్సర్బింగ్ ఫిల్టర్, దీనినే హై ఏపీసెన్సీ పర్టిక్యులేట్ అరెస్టన్స్ ఫిల్టర్(హెచ్ ఈపీఏ)తో కూడిన ఎయిర్ ప్యూరిఫైయర్‌ని ఉపయోగించాలి.
ఈ ఫిల్టర్ మీ ఇంటి గాలిలో ఉండే ధూళి కణాలు, కాలుష్య కారకాలను శుభ్రపరుస్తుంది. మీకు శ్వాస తీసుకోవడానికి స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది.
రోజూ 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. వ్యాయామం మీ శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది. అంతేకాదు మీ ఊపిరితిత్తులను బలపరుస్తుంది. మధుమేహానికి స్థూలకాయం ప్రధాన కారణం, కాబట్టి వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బయట కంటే ఇంట్లోనే వ్యాయామం చేయడం ఉత్తమం.
ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ "సి" అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. విటమిన్ "సి" రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో బయటకు వెళ్లాల్సి వస్తే మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. దీనివల్ల కొంతమేర కాలుష్యం వల్ల కలిగే హాని కూడా తగ్గుతుంది.
ఇది కూడా చదవండి.. వాయు కాలుష్యం కారణంగా పెరగనున్న మధుమేహ సమస్య..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
