మధుమేహానికి కారణమయ్యే ప్రధాన కారకాల గురించి తెలుసా..?  

షేర్ చేయండి:
మధుమేహానికి కారణమయ్యే ప్రధాన కారకాల గురించి తెలుసా..?  

సాక్షి లైఫ్ : ప్యాంక్రియాస్‌లో ఇన్సులిన్ లోపం ఉన్నప్పుడు, అంటే తక్కువ మొత్తంలో ఇన్సులిన్ పంపిణీ అవుతుంది, అప్పుడు రక్తంలో గ్లూకోజ్ పరిమాణం పెరగడం ప్రారంభమవుతుంది. ఈ పరిస్థితిని మధుమేహం అంటారు. మధుమేహానికి ప్రధాన కారణాలలో జీవనశైలి, ఒత్తిడి , అధిక మద్యపానం ఉన్నాయి. అంతేకాదు డయాబెటీస్ కు ఇతర కారణాలు కూడా ఉన్నాయి.. అవేంటంటే..?  

ఇది కూడా చదవండి.. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?  

ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..? 

 

మధుమేహానికి కొన్నిరకాల పదార్థాలు కారణమని చెబుతున్నారు వైద్యనిపుణులు. ఈ అలవాట్లను వదిలేస్తేనే షుగర్ వ్యాధి తలెత్తదని వారు వెల్లడిస్తున్నారు. మధుమేహాన్ని "చక్కెర వ్యాధి" అని కూడా అంటారు. ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి. ఈ వ్యాధి గురించి ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. మధుమేహం కూడా జన్యుపరంగా వచ్చే వ్యాధే. అంతేకాదు  జీవనశైలి కారణంగా కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది.

భారతదేశంలో మధుమేహం ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్య. ఇది ప్రస్తుతం జనాభాలో 11.4 శాతం అంటే, దాదాపు 101 మిలియన్ల మందిని ప్రభావితం చేస్తోంది. అలాగే జనాభాలో 15.3శాతం లేదా దాదాపు 136 మిలియన్ల మంది ప్రజలు ప్రీ-డయాబెటిక్‌తో బాధపడుతున్నారు. ఈ వ్యాధి ప్రమాదాల నుంచి సురక్షితంగా ఉండటానికి, దానిని సరిగ్గా నిర్వహించడం చాలా ముఖ్యం. ఇందులో ఆహారం, వ్యాయామం కీలక పాత్ర పోషిస్తాయి. ఆరోగ్యంగా ఉండేందుకు దినచర్యలో యోగా, నడక, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటివి ఖచ్చితంగా చేయాలని సూచిస్తున్నారు వైద్యనిపుణులు.  

డయాబెటిక్ రోగి రక్తంలో చక్కెర స్థాయి సాధారణం కంటే ఎక్కువగా ఉండటం లేదా సాధారణం కంటే తక్కువగా ఉండకూడదు. కాబట్టి ఈ ఉగాది ఉన్నవారు షుగర్ లెవల్ ని ఎప్పటికప్పుడు టెస్టు చేయించుకోవాలి. చక్కెర స్థాయి ఆకస్మికంగా పెరగడం లేదా ఆకస్మికంగా తగ్గడం, రెండు పరిస్థితులు రోగికి ప్రమాదకరమే. మధుమేహానికి కారణమయ్యే ప్రధాన కారకాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

డయాబెటీస్.. 

నిద్ర.. 

మంచి నిద్ర ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఇది ఒత్తిడిని తొలగిస్తుంది. ఒత్తిడిని తొలగించడం ద్వారా అనేక సమస్యలు తగ్గుతాయి. రాత్రిపూట 7 నుంచి 8 గంటలు నిద్ర తప్పనిసరిగా అవసరం.

 శారీరక శ్రమ లేకపోవడం.. 

 శారీరక శ్రమ లేకపోతే, అనేక వ్యాధులను ఆహ్వానిస్తున్నారని అర్థం చేసుకోండి. నిజానికి మనం ఏది తిన్నా, ఏ విధమైన కార్యకలాపాలు చేయకున్నా అది శరీరంలో కొవ్వుగా పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. దీని వల్ల ఊబకాయ సమస్య తలెత్తుతుంది. ఈ సమస్య అనేక హార్మోన్ల మార్పులకు కారణమవుతుంది, ఇది శరీరం పనితీరును ప్రభావితం చేస్తుంది.

ఒత్తిడి..  

ఎలాంటి ఒత్తిడి అయినా ఆరోగ్యానికి హానికరమే. ఎందుకంటే ఒత్తిడి రక్తపోటును పెంచుతుంది. బీపీ పెరగడం వల్ల షుగర్ లెవెల్ కూడా పెరుగుతుంది.

ఉప్పు..  

ఆహారంలో ఎక్కువగా ఉప్పు తీసుకోవడం వల్ల అది బిపిని పెంచుతుంది.  బ్లడ్ ప్రెజర్ పెరిగితే షుగర్ లెవల్స్ ని ప్రభావితం చేస్తుంది.

చక్కెర..  

ఆహారంలో చక్కెర లేదా తీపి పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. మీరు తీపి పదార్థాలను ఇష్టపడితే, చక్కెర స్థాయి పెరగకుండా చూసుకోవడానికి శారీరక వ్యాయామం తప్పనిసరిగా చేయాలి.  

ధూమపానం.. 

ధూమపానం ఊపిరితిత్తులతో పాటు గుండెపై కూడా ప్రభావం చూపుతుంది. ధూమపానం ఇన్సులిన్ పనితీరును ప్రభావితం చేస్తుంది.

మద్యం..  

మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. మద్యపానం వల్ల ఊబకాయంతో పాటు బీపీ, షుగర్ కూడా పెరిగే అవకాశం ఉంది.

 

ఇది కూడా చదవండి..అధిక రక్తపోటుకు బ్రెయిన్ స్ట్రోక్ కు లింక్ ఏంటి..?

ఇది కూడా చదవండి..Menopause : మెనో పాజ్ వల్ల కూడా డిప్రెషన్ కు గురవుతారా..?

ఇది కూడా చదవండి..For health : కుంకుమ పువ్వు"టీ"తో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి..?

 

 
గమనిక:
ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.