Don't Ignore Pneumonia : న్యుమోనియాను లైట్ తీసుకోవద్దు.. ఈ ప్రారంభ లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వండి..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి జలుబు, దగ్గు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల కేసులు నగరాల్లో, గ్రామాల్లో వేగంగా పెరుగు తున్నాయి. అయితే, వీటితో పాటు ప్రాణాంతక 'న్యుమోనియా' (Pneumonia) బారిన పడే ప్రమాదం కూడా ఈ సీజన్‌లో గణనీయంగా పెరుగుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఐదేళ్ల లోపు చిన్నపిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో రోగనిరోధక శక్తి (Immunity) తక్కువగా ఉన్నవారు ఈ ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది.

ఇది కూడా చదవండి.. ప్రాణాంతకమైన వ్యాధులకు కారణమయ్యే జంతువులు.. 

ఇది కూడా చదవండి.. వేసవికాలంలో కళ్లను కాపాడుకునేదెలా..?  

ఇది కూడా చదవండి.. ప్రాణాంతకమైన వ్యాధులకు కారణమయ్యే జంతువులు..

 

వైరస్‌లు, బ్యాక్టీరియా వేగంగా.. 

తేమతో కూడిన వాతావరణం, ఉష్ణోగ్రతలలో అకస్మాత్తుగా వచ్చే మార్పుల వల్ల వైరస్‌లు, బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెంది వ్యాప్తి చెందుతాయి. వైద్య పరిశోధనల ప్రకారం, వేసవితో పోలిస్తే వర్షాకాలంలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల తీవ్రత దాదాపు మూడు రెట్లు పెరుగుతుంది. అంతేకాకుండా, ఎక్కువసేపు వర్షంలో తడవడం, తడి బట్టలతో ఉండటం వల్ల కూడా శరీర ఉష్ణోగ్రత పడిపోయి న్యుమోనియా ముప్పు పొంచి ఉంటుంది.

న్యుమోనియా అంటే ఏమిటి..?

 న్యుమోనియా అనేది ఊపిరితిత్తులకు (Lungs) సంబంధించిన తీవ్రమైన ఇన్ఫెక్షన్. బ్యాక్టీరియా లేదా వైరస్ల దాడి వల్ల ఊపిరితిత్తుల్లోని వాయుగోళాలు (Alveoli) వాపునకు గురవుతాయ వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

దీనివల్ల ఆ గాలి గదుల్లో ద్రవం లేదా శ్లేష్మం చేరుతుంది. ఫలితంగా రోగికి శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గి శరీరానికి, రక్తానికి అందాల్సిన ఆక్సిజన్ సరఫరా నిలిచిపోతుంది.

ప్రారంభ లక్షణాలు..  

 సాధారణ జలుబే కదా అని వదిలేయకండి..!

న్యుమోనియా మొదట్లో సాధారణ జలుబు లేదా ఫ్లూ లాగే కనిపిస్తుంది. అందుకే చాలామంది దీనిని తేలికగా తీసుకుంటారు. కానీ వ్యాధి ముదిరే కొద్దీ కింది లక్షణాలు తీవ్రమవుతాయి. తీవ్రమైన జ్వరం..చలితో కూడిన విపరీతమైన జ్వరం రావడం.కఫంతో కూడిన దగ్గు..ఆగకుండా దగ్గు రావడం, ఉమ్మిలో శ్లేష్మం పడటం. శ్వాస ఆడకపోవడం.. కొద్ది దూరం నడిచినా లేదా కూర్చున్నా రొప్పుతూ ఊపిరి పీల్చుకోవడం. ఛాతీలో నొప్పి.. గాలి పీల్చేటప్పుడు లేదా దగ్గేటప్పుడు ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడం. ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడం.. రక్తంలో ఆక్సిజన్ శాతంలో హెచ్చుతగ్గులు జరగడం.

పిల్లల విషయంలో 'అలర్ట్' అవ్వండి..!

చిన్నపిల్లల్లో న్యుమోనియా లక్షణాలు చాలా వేగంగా ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. తల్లిదండ్రులు కింది సంకేతాలను గమనించిన వెంటనే ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి తరలించాలి. పాలు లేదా ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం, నిరంతరం ఏడవడం. పక్కటెముకలు లోపలికి పోతూ, సాధారణం కంటే వేగంగా శ్వాస తీసుకోవడం. విపరీతమైన మగతగా ఉండటం, అచేతనంగా పడి ఉండటం. ఆక్సిజన్ అందక పెదవులు, గోళ్లు నీలం లేదా బూడిద రంగులోకి మారడం.

నివారణ ఎలా అంటే..? 

వర్షాకాలంలో వీలైనంత వరకు వర్షంలో తడవకుండా జాగ్రత్తపడాలి. ఇంట్లో ఎవరికైనా జలుబు, దగ్గు ఉంటే చిన్నపిల్లలను, వృద్ధులను వారికి దూరంగా ఉంచడం మంచిది. ముఖ్యంగా ఆస్తమా, మధుమేహం, గుండె జబ్బులు ఉన్నవారు వైద్యుల సలహాతో ముందస్తుగా నివారణ వ్యాక్సిన్లు (Pneumococcal Vaccine) తీసుకోవడం ఉత్తమం. యాంటీబయాటిక్స్ సొంతంగా వాడటం జోలికి వెళ్లకుండా, లక్షణాలు కనిపించిన వెంటనే అర్హులైన వైద్యులను సంప్రదించడం ద్వారా న్యుమోనియా ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడవచ్చు.

ఇది కూడా చదవండి.. పీడకలలు రావడానికి కారణాలేంటి..? 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

ఇది కూడా చదవండి.. తినే ఆహారానికి, అనారోగ్య సమస్యలకు లింక్ ఏంటి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.