వేసవికాలంలో గట్ హెల్త్ ను మెరుగు పరిచే ఫుడ్..
సాక్షి లైఫ్ : వేసవికాలంలో చాలామందిలో జీర్ణ సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. కడుపు చల్లగా ఉంచుకోవడానికి ఐస్ క్రీం వంటి అనేక ఆహారాపదార్థాలకు దూరంగా ఉండాలని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. సమ్మర్ లో తిన్న ఆహారం సరిగా అరగక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడానికి ఆహారంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని చేర్చుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం వేసవికాలంలో జీర్ణ సమస్యలను దూరం చేయడంలో సహాయపడే కొన్ని ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి.. ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?
చాలా హాని..
ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో చల్లదనంకోసం శీతల పానీయాలు, ఐస్ క్రీం, జ్యూస్ లు వంటివి తాగుతూ ఉంటారు. ఇవి చల్లదనాన్ని కలిగిస్తాయి. కానీ అవి ఆరోగ్యానికి చాలా హానికరం. వీటిలో ఉండే చక్కెర,ప్రిజర్వేటివ్‌ల వల్ల ఆరోగ్యానికి చాలా హాని కలుగుతుంది.
జీర్ణ సమస్యలు..
అంతేకాదు వీటి కారణంగా, జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తాయి. దీని వల్ల కడుపు ఉబ్బరం, అసిడిటీ, ఆకలి లేకపోవటం వంటి సమస్యలు వస్తాయి. అందువల్ల, వేసవి కాలంలో మీ జీర్ణక్రియ (గట్ హెల్త్) పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. సమ్మర్ సీజన్ లో మీ ఆహారంలో ఎలాంటి ఆహార పదార్థాలు చేర్చుకుంటే మీ జీర్ణక్రియకు (గట్ హెల్త్) కు ఉపయోగకరంగా ఉంటుందంటే..?
పెరుగు అన్నం..
పెరుగుఅన్నంలో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇది గట్ మైక్రోబయోమ్‌ను పెంచుతుంది. అందువల్ల పెరుగు జీర్ణవ్యవస్థకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పెరుగు అన్నం కోసం మిల్లెట్స్ కూడా ఉపయోగించవచ్చు. ఇది జీర్ణక్రియకు చాలా బాగా ఉపయోగ పడుతుంది. పెరుగన్నం సులభంగా జీర్ణమవుతుంది.
హెర్బల్ టీ..
జీర్ణక్రియకు హెర్బల్ టీ చాలా మేలు చేస్తుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గించడంలో చాలా సహాయపడుతుంది. హెర్బల్ టీలు ఉబ్బరం తగ్గిస్తాయి. రిలాక్స్‌గా ఉండేలా చేస్తాయి. నిద్రవేళకు ముందు హెర్బల్ టీ తాగడం వల్ల మంచి నిద్ర. పడుతుంది. ఇది తాగడం వల్ల మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
ఇది కూడా చదవండి.. ఆల్కహాల్ లోని ఏ కాంపోనెంట్ ఫ్యాటీ లివర్ కు కారణమవుతుంది..?
మొలకలు..
ఫైబర్, విటమిన్లు, అనేక ఖనిజాలు మొలకలలో కనిపిస్తాయి. ఇవి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. పెసర మొలకలను కూడా అల్పాహారంలో చేర్చుకోవడం ద్వారా మలబద్ధక సమస్య పరిష్కారమతుంది. తక్కువ సమయంలో ఎక్కువ శక్తి వస్తుంది. ఇవితినడం వల్ల వేసవిలో కడుపు ఉబ్బరంగా అనిపించదు.
సలాడ్..
దోసకాయ, టమోటా, ఉల్లిపాయ సలాడ్ సమ్మర్లో చాలా మేలు చేస్తాయి. వీటన్నింటిలో నీరు పుష్కలంగా ఉంటుంది. ఇవి డీహైడ్రేషన్ నుంచి ఉపశమనం కల్గించి కడుపును చల్లగా ఉంచుతాయి. అంతేకాకుండా వీటిని తినడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. కడుపు ఉబ్బరం,అసిడిటీ వంటి సమస్యలు తలెత్తవు.
ఇది కూడా చదవండి.. బ్లాక్ సాల్ట్ బెనిఫిట్స్ ఎన్నో..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
