Cholesterol Control : కొలెస్ట్రాల్‌ ను సమర్థంగా అరికట్టే పానీయాలు..

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : శరీరంలో 'చెడు' కొలెస్ట్రాల్ (LDL) పెరగడం అనేది నిశ్శబ్ద శత్రువు లాంటిది. గణాంకాల ప్రకారం, అధిక కొలెస్ట్రాల్ ఉన్న వారిలో దాదాపు 40 శాతం మందికి ఆ విషయం ముందే తెలియదు. రక్తనాళాల్లో పేరుకుపోయే ఈ కొవ్వు.. గుండె జబ్బులకు ప్రధాన కారణమవుతుంది. అయితే, నిపుణుల సూచనల ప్రకారం మనం రోజూ తాగే పానీయాల్లో కొన్ని మార్పులు చేసుకుంటే కొలెస్ట్రాల్‌ను సమర్థవంతంగా అరికట్టవచ్చని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. 

ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

దానిమ్మ రసంలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఉదయాన్నే దానిమ్మ రసం తాగడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. దీనిలోని 'పాలీఫెనాల్స్' అనే యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ వల్ల రక్తనాళాల్లో పాచి (Plaque) పేరుకుపోకుండా కాపాడతాయి.  రోజుకు ఒక కప్పు దానిమ్మ రసం తాగిన వారిలో కేవలం రెండు వారాల్లోనే ట్రైగ్లిజరైడ్లు తగ్గుముఖం పట్టినట్లు పరిశోధనలు చెబుతున్నాయి.

రక్తపోటు నియంత్రణతోపాటు కొలెస్ట్రాల్‌ను హైబీపీని తగ్గించడంలోనూ సహాయపడుతుంది. మార్కెట్లో దొరికే కృత్రిమ పానీయాల కంటే 100శాతం స్వచ్ఛమైన దానిమ్మ రసాన్ని ఎంచుకోవాలి. పంచదార కలపకుండా తాగడం ఉత్తమం.

ఆరోగ్యానికి మరికొన్ని 'మ్యాజిక్' డ్రింక్స్..  

కేవలం దానిమ్మ మాత్రమే కాకుండా, మరికొన్ని పానీయాలు కూడా గుండెకు మేలు చేస్తాయి. 

టొమాటో జ్యూస్లో ఉండే 'లైకోపీన్' అనే అంశం మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయిలను పెంచుతుంది. అయితే, ఉప్పు (సోడియం) తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ప్రతిరోజూ గ్రీన్ టీ తాగడం వల్ల శరీరంలోని మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. బెర్రీలు, చియా సీడ్స్, ఓట్ పాలతో చేసే స్మూతీలలో ఉండే పీచు పదార్థం (Soluble Fiber) కొవ్వును కరిగించడానికి తోడ్పడుతుంది.

సమతుల్య ఆహారం..

ఆరోగ్యకరమైన పానీయాలు కొలెస్ట్రాల్ నియంత్రణకు తోడ్పడతాయి కానీ, ఇవి మందులకు ప్రత్యామ్నాయం కావు. సరైన వ్యాయామం, సమతుల్య ఆహారంతో పాటు వైద్యుల సలహాలు పాటించడం గుండె ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం.

ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.