IVF Services : సర్కారు దవాఖానల్లో సంతాన సాఫల్య చికిత్సా కేంద్రాలు.. సత్ఫలితాలిస్తున్న ఐవీఎఫ్ సేవలు..
సాక్షి లైఫ్ : పిల్లలు లేక ఏళ్ల తరబడి ఎదురుచూస్తూ.. ప్రైవేటు ఆస్పత్రుల్లో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి విసిగిపోయిన నిరుపేద జంటలకు ప్రభుత్వ వైద్యం కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి, పెట్లబుర్జులోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి (MGMH)లో అత్యాధునిక సంతాన సాఫల్య కేంద్రాల (IVF Centres) ఏర్పాటు తర్వాత ఫలితాలు ఆశాజనకంగా వస్తున్నాయి.
అల్వాల్‌కు చెందిన 30 ఏళ్ల మహిళ ఏడేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో పలుమార్లు చికిత్స పొందినా ఫలితం లేకపోవడంతో గతేడాది ఫిబ్రవరిలో గాంధీ ఆస్పత్రిని ఆశ్రయించారు. అక్కడ ఐవీఎఫ్ (In-vitro Fertilization) ప్రక్రియ ద్వారా ఆమె గర్భం దాల్చి, ఇటీవలే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ప్రభుత్వ రంగంలో అందుబాటులోకి వచ్చిన ఈ అత్యాధునిక సదుపాయం నిరుపేదలకు వరంలా మారింది.
ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?
ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
విజయవంతమైన చికిత్సలు..
ప్రభుత్వ సంతాన సాఫల్య కేంద్రాల్లో వైద్యులు అనుసరిస్తున్న వివిధ రకాల చికిత్సా విధానాలు ఆశించిన ఫలితాలను ఇస్తున్నాయి. ప్రధానంగా అండాల ఉత్పత్తిని పెంచే 'ఓవులేషన్ ఇండక్షన్' ప్రక్రియలో అత్యధికంగా 3,004 మంది మహిళలకు చికిత్స అందించగా, అందులో 159 మంది గర్భం దాల్చి సానుకూల ఫలితాలను పొందారు.
అదేవిధంగా, శుక్రకణాలను నేరుగా గర్భాశయంలోకి ప్రవేశపెట్టే 'ఐయూఐ' (IUI) విధానం ద్వారా 366 మందికి చికిత్స చేయగా, 19 మందికి సంతాన భాగ్యం కలిగింది. అత్యంత సంక్లిష్టమైన, ఖరీదైన 'ఐవీఎఫ్' (IVF) విధానంలోనూ సర్కారు దవాఖానలు వెనకడుగు వేయలేదు. ఇప్పటివరకు 97 ఐవీఎఫ్ స్టిమ్యులేషన్ సైకిల్స్ నిర్వహించగా, అందులో 12 కేసులు విజయవంతమై నిరుపేద తల్లుల ఇంట వెలుగులు నింపాయి. ఈ గణాంకాలు ప్రభుత్వ వైద్యంపై సామాన్యుల్లో నమ్మకాన్ని రెట్టింపు చేస్తున్నాయి.
కేవలం సాధారణ పరీక్షలే కాకుండా.. ఐయూఐ (నేరుగా గర్భాశయంలోకి శుక్రకణాలను పంపడం), ఐవీఎఫ్ వంటి ఖరీదైన చికిత్సలు ఇక్కడ ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. పెట్లబుర్జు ఆస్పత్రిలో 1,454 ప్రక్రియల ద్వారా 103 మందికి, గాంధీ ఆస్పత్రిలో 1,550 ఓవులేషన్ ఇండక్షన్ ప్రక్రియల ద్వారా 56 మందికి సానుకూల ఫలితాలు వచ్చినట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
