Effective Weight Loss : బరువు తగ్గడం కోసం తీసుకునే కేలరీలను నియంత్రించుకోవాలనుకుంటే ఏమి చేయాలి ..?
సాక్షి లైఫ్ : మారుతున్న జీవనశైలి, శారీరక శ్రమ లోపించడం వల్ల నేటి రోజుల్లో ఊబకాయం తీవ్ర సమస్యగా మారుతోంది. బరువు పెరిగే కొద్దీ మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధుల ముప్పు పెరుగుతుంది. శరీర బరువును అదుపులో ఉంచుకోవడానికి క్యాలరీల నియంత్రణ ఎంతో కీలకమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే బరువు తగ్గడమంటే పస్తులుండటం లేదా పూర్తిగా ఆహారాన్ని మానేయడం కాదు, రోజూ తీసుకునే ఆహార పరిమాణంపై శ్రద్ధ వహించి, క్యాలరీలను సమతుల్యం చేసుకోవడమే సరైన మార్గం. మనం రోజూ తీసుకునే కొన్ని ఆహారాల ద్వారా మనకు తెలియకుండానే అధిక మొత్తంలో క్యాలరీలు శరీరంలోకి చేరుతుంటాయి. వాటిని ఎలా నియంత్రించాలో తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?
చక్కెర పానీయాలు, ప్యాక్డ్ జ్యూస్‌లకు దూరం..
శీతల పానీయాలు, చక్కెర ఎక్కువగా ఉండే టీ, కాఫీలు, ఎనర్జీ డ్రింక్స్ ద్వారా అధిక క్యాలరీలు సులభంగా శరీరంలో చేరతాయి. ప్యాక్ చేసిన పండ్ల రసాలకు బదులుగా తాజా పండ్లను నేరుగా తినడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల శరీరానికి పీచు పదార్థం (Fiber) లభించడంతో పాటు అనవసర చక్కెరలు దూరమవుతాయి. రోజువారీగా తీసుకునే తియ్యటి పానీయాల పరిమాణాన్ని క్రమంగా తగ్గించాలి.
వేపుళ్లు, నూనె పదార్థాలకు ప్రత్యామ్నాయాలు..
సమోసాలు, బజ్జీలు, చిప్స్ వంటి వేయించిన చిరుతిళ్లలో పరిమాణం తక్కువగా కనిపించినా క్యాలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. సాయంత్రం వేళ తీసుకునే స్నాక్స్‌లో వేయించిన పదార్థాలకు బదులుగా ఉడకబెట్టిన శనగలు, కాల్చిన వేరుశనగలు లేదా తక్కువ ఉప్పు ఉన్న డ్రై ఫ్రూట్స్‌ను ఎంచుకోవచ్చు. వంటల్లో నూనె వాడకాన్ని తగ్గించడం మంచిది. ఒకేసారి తగ్గించడం కష్టమైతే, ప్రతి నెలా కొద్దికొద్దిగా వినియోగాన్ని తగ్గిస్తూ రావాలి.
టీతో పాటు బిస్కెట్లు, మిక్చర్లు వద్దు..!
చాలామంది రోజులో రెండు మూడు సార్లు టీ తాగే అలవాటుతో పాటు బిస్కెట్లు, మిక్చర్లు వంటివి తింటుంటారు. ఇవి చిన్న మొత్తంలోనే అనిపించినా, రోజంతా కలిపి చూస్తే పెద్ద మొత్తంలో క్యాలరీలుగా మారిపోతాయి. ఆకలి లేకుండా కేవలం అలవాటు కొద్దీ చిరుతిళ్లు తినే ధోరణిని మానుకోవాలి. ప్యాక్ చేసిన ఆహారాలను కొనుగోలు చేసేటప్పుడు లేబుల్స్‌పై ఉండే క్యాలరీలు, సంతృప్త కొవ్వుల (Saturated fat content) వివరాలను గమనించడం ముఖ్యం.
కఠినమైన డైటింగ్‌ల జోలికి వెళ్లొద్దు..
బరువు తగ్గాలనే ఆత్రుతతో అన్నం, రోటీ లేదా పండ్లను పూర్తిగా దూరం పెట్టాల్సిన అవసరం లేదు. మోతాదుకు మించి కఠినమైన ఆహార నియమాలు పాటిస్తే పోషకాహార లోపం తలెత్తే ప్రమాదం ఉంది. పళ్లెం నిండా తాజా కూరగాయలు, తృణధాన్యాలు, ప్రొటీన్ ఉండే సమతులాహారాన్ని తీసుకోవాలి. కడుపు నిండే వరకు కాకుండా, కొద్దిగా ఖాళీ ఉండేలా చూసుకుని మితాహారం తీసుకోవడం ఉత్తమం. సరైన ఆహార నియమాలతో పాటు రోజుకు 7 నుంచి 8 గంటల నాణ్యమైన నిద్ర, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల అదనపు క్యాలరీలు ఖర్చయి బరువు అదుపులో ఉంటుంది.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
