Global Handwashing Day-2025: హ్యాండ్‌వాష్‌ సరిగా చేయకపోవడం వల్లే వైరల్ ఇన్ఫెక్షన్స్..   

షేర్ చేయండి:
Global Handwashing Day-2025: హ్యాండ్‌వాష్‌ సరిగా చేయకపోవడం వల్లే వైరల్ ఇన్ఫెక్షన్స్..   

సాక్షి లైఫ్ : వాతావరణంలో మార్పులు వస్తున్న ప్రతిసారీ, ప్రజారోగ్యానికి వైరల్ ఇన్ఫెక్షన్ల (Viral Infections) ముప్పు పెరుగుతుంది. జలుబు, జ్వరం, దగ్గు వంటి సమస్యలతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. ఈ ఇన్ఫెక్షన్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఉన్న అత్యంత సులువైన, చౌకైన మార్గం చేతులను శుభ్రంగా కడుక్కోవడం (Hand Washing) అని ఆరోగ్య నిపుణులు మరోసారి నొక్కి చెబుతున్నారు. నేడు గ్లోబల్ హ్యాండ్ వాష్ డే సందర్భంగా సాక్షి లైఫ్ స్పెషల్ స్టోరీ.. 

ఇది కూడా చదవండి.. 30 ఏళ్ల తర్వాత శరీరానికి కొల్లాజెన్ ఎందుకు ముఖ్యమంటే..?

 

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

 

ప్రపంచంలో అనేక అంటువ్యాధులను అరికట్టే అతి సులువైన మార్గం ఏదైనా ఉందంటే అది కేవలం 'చేతులు కడుక్కోవడం' మాత్రమే. ఈ సరళమైన అలవాటు ప్రాముఖ్యతను ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు తెలియజేయడానికి ప్రతి సంవత్సరం అక్టోబర్ 15న అంతర్జాతీయ చేతులు కడుక్కునే దినోత్సవం (Global Handwashing Day) నిర్వహిస్తున్నారు.

ఎందుకంటే...?

క్రిముల వాహకాలు చేతులే: వైరస్‌లు, బ్యాక్టీరియాలు మనం తాకే వస్తువుల నుంచి చేతుల ద్వారానే మన నోరు, కళ్ళు లేదా ముక్కులోకి ప్రవేశిస్తాయి.
చేతులను సబ్బుతో కనీసం 20 సెకన్ల పాటు శుభ్రం చేసుకోవడం ద్వారా, 80శాతం వరకు రోగకారక క్రిముల వ్యాప్తిని అరికట్టవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.

ప్రతి ఒక్కరి దినచర్యలో ఇవి తప్పనిసరి.. 

ఆహారం ముందు, తర్వాత: తినడానికి ముందు, తిన్న తర్వాత తప్పకుండా చేతులు కడుక్కోవాలి.. లేదంటే బ్యాక్టీరియా ముప్పు పెరిగే ప్రమాదం ఉంది.  

బయట నుంచి రాగానే.. పిల్లలైనా, పెద్దలైనా బయట నుంచి ఇంటికి రాగానే కచ్చితంగా హ్యాండ్‌వాష్ చేసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. 

తుమ్మినా, దగ్గినా సరే ..? తుమ్మిన తర్వాత లేదా దగ్గిన తర్వాత మీ చేతులను వెంటనే శుభ్రం చేసుకోవడం కూడా చాలా మంచిది.  

టాయిలెట్ వాడిన తర్వాత కచ్చితంగా.. టాయిలెట్ వాడిన తర్వాత చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలి. లేదంటే రోగకారక క్రిములు చేతులకు అంటుకుని పలు రకాల ఇన్ఫెక్షన్ల కు కారణమవుతాయి. 

కాబట్టి చేతులను కడుక్కునే అలవాటును ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భాగం చేసుకోవాలి. తద్వారా వైరస్ బారి నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సురక్షితంగా ఉంచుకోవడానికి వీలవుతుంది.  

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

 

గమనికఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.