గుండెపోటు : 'గోల్డెన్ అవర్' అంటే ఏమిటి..?
సాక్షి లైఫ్ : గుండెపోటు అనేది సకాలంలో చికిత్స అందకపోతే ప్రాణాలను తీసే ఒక తీవ్రమైన సమస్య. ఏటా వేలాది మంది ఈ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపధ్యంలో 'గోల్డెన్ అవర్' అనే పదం చాలా కీలకమైనదిగా మారుతోంది. గుండెపోటు లక్షణాలు మొదలైనప్పటి నుంచి వచ్చే మొదటి గంటను 'గోల్డెన్ అవర్' అని పిలుస్తారు. ఈ సమయంలో సరైన వైద్య సహాయం అందితే ప్రాణాలను కాపాడే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
'గోల్డెన్ అవర్' ఎందుకు అంత ముఖ్యం..?
దేశంలో పెరుగుతున్న గుండెపోటు కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. చాలా మందిలో సరైన సమయంలో చికిత్స అందకపోవడానికి, గుండెపోటు లక్షణాలపై అవగాహన లేకపోవడమే ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. గుండెపోటు లక్షణాలు మొదటిసారి కనిపించిన మొదటి గంటలోనే రోగికి సరైన వైద్య సహాయం అందితే, వారు ప్రాణాలతో బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యనిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. ఎలాంటి ఆసనాలు, ముద్రలు వేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
