పేగును శుభ్రపరచడం వల్ల కలిగే ప్రయోజనాలు..
సాక్షి లైఫ్ : ఆరోగ్యంగా ఉండటానికి, ఆరోగ్యకరమైన ప్రేగు(హెల్తీ గట్) కలిగి ఉండటం చాలా అవసరం. మారుతున్న జీవనశైలి, ప్రస్తుతం ఉన్నఆహారపు అలవాట్ల కారణంగా ప్రేగులు విషపదార్ధాలతో నిండిపోతున్నాయి. దీని వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కాబట్టి కొన్ని రకాల ఆహారపదార్థాలు తీసుకోవడం ద్వారా కడుపును శుభ్రం చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి.. బ్యాక్టీరియా ఎలా సంక్రమిస్తుంది..?
ఇది కూడా చదవండి.. ఎండాకాలంలో వీటిని తప్పనిసరిగా నివారించాలి..
ఈ రోజుల్లో నాన్ వెజ్, షుగర్, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా ప్రజల జీవనశైలిలో భాగమైపోయాయి. అంతేకాకుండా ఆరోగ్యకరమైన పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, ఇతర ఆహారాలకు దూరంగా ఉంటున్నారు. దీని కారణంగా జీర్ణవ్యవస్థ మందగిస్తుంది.పెద్దప్రేగు గోడలపై టాక్సిన్స్ పొరలు పేరుకుపోతున్నాయి. ఇది జీర్ణవ్యవస్థలో బ్యాక్టీరియా ను పెంచుతుంది. ఇది ఆహారంలో ఉండే విటమిన్లు, ఖనిజాలు, ఇతర పోషకాలను గ్రహించడం వల్ల అనేక రకాల వ్యాధులు వస్తున్నాయి.
దీనికి ఉత్తమ పరిష్కారం గట్ ఆరోగ్యానికి ఉపయోగపడే ఆహారం తీసుకోవడం ఒక్కటే. పెద్దప్రేగు శుభ్రపరిచే ప్రక్రియకు తోడ్పడే ఆహారాలను తీసుకోవడం. కోలన్ క్లెన్సింగ్ అనేది మంచి ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన అంశం. పెద్దప్రేగు క్లీనింగ్ కోలన్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పెద్దప్రేగు శుభ్రపరచడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలానే ఉన్నాయి.
-జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
-పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
-శరీరంలో శక్తిని పెంచుతుంది.
-బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది.
-శ్లేష్మం విషాన్ని తగ్గిస్తుంది.
-చర్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
ఇది కూడా చదవండి.. హోమియోపతి వైద్యంలో క్యేన్సర్ కు చికిత్స ఉందా..?
ఇది కూడా చదవండి..పెరుగులో చక్కెర వేసుకుని తింటే బరువు పెరుగుతారా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
