Sinus Problems : సైనస్ తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా..? మందులు వాడినా తగ్గట్లేదా..? ఐతే అసలు కారణం ఇదే కావొచ్చు..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : వాతావరణం మారగానే ముక్కు దిబ్బడ, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి సమస్యలు సర్వసాధారణం. ఇవి సాధారణంగా వారం రోజుల్లో తగ్గిపోతాయి. కానీ, నెలల తరబడి వేధిస్తూ, ఎన్ని మందులు వాడినా ఫలితం లేకపోతే..? అది కేవలం వాతావరణ మార్పుల వల్ల వచ్చిన సమస్య కాకపోవచ్చు.బ్రిటన్‌కు చెందిన 56 ఏళ్ల రోజర్ హార్డీ అనే వ్యక్తి వృత్తి రీత్యా ఒక శిల్పి. చెక్కపొట్టు, రసాయనాల మధ్య పనిచేసే ఆయనకు తరచుగా ముక్కులో మంట, నొప్పి వచ్చేవి. వాతావరణం వల్లనేమో అనుకుని నిర్లక్ష్యం చేశాడు. కానీ సమస్య తీవ్రమై రాత్రిళ్లు ముక్కు మూసుకుపోయి, నోటితో శ్వాస తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?

ఇది కూడా చదవండి..Jamun Benifits : జీర్ణ సమస్యలకు సరైన దివ్యౌషధం నేరేడు పండు.. 

 

వైద్యులు దీన్ని 'సైనసైటిస్' గా గుర్తించి యాంటీబయోటిక్స్, నాసల్ స్ప్రేలు ఇచ్చారు. మందులు వాడినన్ని రోజులు బాగానే ఉన్నా, ఆపగానే మళ్లీ సమస్య మొదటికి వచ్చేది. దీంతో ఆయనకు క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధి ఏదైనా సోకిందేమోనని భయం పట్టుకుంది.

అసలు కారణం తెలిస్తే షాకే..!

ఎన్ని ఆసుపత్రులు తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో, చివరకు ఒక పోషకాహార నిపుణుడిని కలిశాడు రోజర్. పొగ తాగే అలవాటు గానీ, మద్యపానం గానీ లేని ఆరోగ్యవంతమైన వ్యక్తికి ఆహారంలోనే ఏదో లోపం ఉండి ఉంటుందని నిపుణులు అనుమానించారు. రోజర్ తీసుకునే ఆహారం గురించి ఆరా తీయగా, ఆయన రోజూ పాలు, పెరుగు, వెన్న, చీజ్ వంటి డెయిరీ ఉత్పత్తులను ఎక్కువగా తీసుకుంటాడని తేలింది.

 వెంటనే వైద్యులు ఒక వారం రోజుల పాటు వాటిని పూర్తిగా మానేయాలని సూచించారు. ఆశ్చర్యంగా, డెయిరీ ఉత్పత్తులు మానేసిన నాలుగైదు రోజుల్లోనే రోజర్ సైనస్ సమస్యలు నయమయ్యాయి. ఎలాంటి మందులు లేకుండానే కేవలం ఆహారంలో మార్పుతో అతనికి పూర్తి ఉపశమనం లభించింది.

పాలు, డెయిరీ ఉత్పత్తులతో సైనస్ వస్తుందా..?

సైనస్ సమస్య ప్రతి ఒక్కరిలో డెయిరీ ఉత్పత్తుల వల్లే రాకపోయినా, కొందరిలో ఇవి ముక్కు దిబ్బడకు కారణమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆవు పాలు లేదా పాలు ఆధారిత ఉత్పత్తుల వల్ల కొందరిలో తెలియకుండానే ఎలర్జీ వచ్చి, అది దీర్ఘకాలిక సైనస్ కు దారితీస్తుందని 'అమెరికన్ జర్నల్ ఆఫ్ రైనాలజీ అండ్ అలర్జీ'లో ప్రచురితమైన ఒక అధ్యయనం కూడా స్పష్టం చేసింది. దీర్ఘకాలిక సైనస్‌తో బాధపడే ప్రతి ఏడుగురిలో ఒకరికి పాలు పడకపోవడం (milk allergy) ఉందని పరిశోధకులు గుర్తించారు.

ఈఎన్టీ వైద్యుల సూచనలు ఇవే..

దీర్ఘకాలికంగా సైనస్ తో బాధపడేవారు కొద్దిరోజుల పాటు 'ఎలిమినేషన్ డైట్' అంటే పాలు, పెరుగు, నెయ్యి, వెన్న వంటివి మానేయడం. పాటించి చూడటం మంచిది. దీనివల్ల మీ ఆరోగ్య స్థితిలో సానుకూల మార్పు కనిపిస్తే, మీకు డెయిరీ ఉత్పత్తులు పడట్లేదని అర్థం చేసుకోవాలి.ఎక్కువ కొవ్వు ఉండే పదార్థాలు, ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్ తినడం వల్ల కూడా శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరిగి సైనస్ తీవ్రమవుతుంది.


ఉప్పు నీటితో అంటే సెలైన్ నాసల్ రిన్స్ రోజుకు రెండుసార్లు ముక్కును శుభ్రం చేసుకోవడం వల్ల సైనస్ నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. సొంత వైద్యం, లేదా మెడికల్ షాపుల్లో అడిగి స్టెరాయిడ్ స్ప్రేలు వాడటం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. సమస్య మూడు నెలలు దాటినా తగ్గకపోతే వెంటనే ఈఎన్టీ అంటే చెవి, ముక్కు, గొంతు నిపుణులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.

ఇది కూడా చదవండి.. అనస్తీషియా ఖాళీ కడుపుతోనే ఎందుకు చేస్తారు..?

ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.