Healthy Cooking Oils for Better Health : ఆరోగ్యానికి మేలు చేసే కుకింగ్ ఆయిల్స్.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఆరోగ్యకరమైన జీవనశైలికి పునాది వంటగది లోనే పడుతుంది. మనం వాడే నూనె కేవలం రుచికే కాదు, గుండె పదిలతకు, చర్మ సౌందర్యానికి కూడా కీలకం. అయితే ఏ వంటకు ఏ నూనె వాడాలో తెలుసుకోవడం అవసరం. ప్రస్తుత మార్కెట్లో రకరకాల నూనెలు అందుబాటులో ఉన్నా, అన్ని రకాల వంటలకు అన్ని నూనెలు సరిపోవు. సరైన నూనెను ఎంచుకోవడం వల్ల అటు పోషకాలు అందడమే కాకుండా, ఇటు వ్యాధుల ముప్పు తప్పుతుంది. మన నిత్య జీవితంలో భాగంగా చేసుకోదగ్గ కొన్ని అత్యుత్తమ వంటనూనెలను పరిశీలిద్దాం.

ఏ నూనెతో.. ఏం లాభం..?

ఆవ నూనె..

భారతీయ వంటలకు ఇది అత్యంత అనువైనది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మెండు. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్-ఇ శరీరానికి రక్షణనిస్తాయి.

కొబ్బరి నూనె..

 జీవక్రియను (Metabolism) మెరుగుపరచడంలో ఇది మేటి. దీనికి 'స్మోక్ పాయింట్' ఎక్కువ ఉండటం వల్ల డీప్ ఫ్రైయింగ్‌కు ఇది శ్రేష్ఠం.

ఆలివ్ నూనె..

గుండె ఆరోగ్యానికి తోడ్పడే మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు ఇందులో అధికం. సలాడ్ డ్రెస్సింగ్స్, తక్కువ వేడితో చేసే వంటలకు ఇది మేలైన ఎంపిక.

నువ్వుల నూనె.. 

 ఇందులోని 'సెసమోల్', 'సెసమిన్' వంటి అంశాలు శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుండి కాపాడుతాయి.

వేరుశనగ నూనె.. 

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఈ నూనెను కూడా డీప్ ఫ్రైయింగ్‌కు నిరభ్యంతరంగా వాడుకోవచ్చు.

రైస్ బ్రాన్ ఆయిల్.. 

 కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచే 'ఒరిజనాల్' అనే యాంటీ ఆక్సిడెంట్ ఇందులో ప్రత్యేక ఆకర్షణ.


నెయ్యి కేవలం రుచి కోసమే కాదు.. విటమిన్లు ఎ, డి, ఇ, కె ల సమాహారం. మితంగా తీసుకుంటే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

అవిసె గింజల నూనె.. 

మెదడు చురుగ్గా పనిచేయడానికి, గుండె దృఢత్వానికి అవసరమైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఇందులో మెండుగా ఉంటాయి. దీనిని పచ్చిగా సలాడ్లలో వాడుకోవడం ఉత్తమం.

కేవలం ఒకే రకమైన నూనెను వాడటం కంటే, వివిధ రకాల నూనెలను మార్చి మార్చి (Rotation basis) ఉపయోగించడం వల్ల శరీరానికి అవసరమైన అన్ని రకాల పోషకాలు అందుతాయి.  

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.