అధిక బరువును నియంత్రించాలనుకుంటే.. ఇలా చేయండి.. 

షేర్ చేయండి:
అధిక బరువును నియంత్రించాలనుకుంటే.. ఇలా చేయండి.. 

సాక్షి లైఫ్ : నేటి బిజీ, అన్ హెల్తీ లైఫ్ లో బరువు పెరగడం అనేది భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగించే అంశంగా మారింది. అధిక బరువు పెరగడం అంటే చెడు కొలెస్ట్రాల్ పెరగడం, దాని పెరుగుదల గుండె ఆరోగ్యాన్ని క్షీణింపచేస్తుంది.కొన్ని ప్రభావవంతమైన చర్యలను అనుసరించడం ద్వారా వెయిట్ ను నివారించడం మంచిది. బరువు పెరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్  వంటి కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.  ఈరోజుల్లో సామాన్యుడి నుంచి ధనవంతుల వరకు గుండె సంబంధిత సమస్యల బారీన పడుతున్నారు. ఈ సమస్యలు ఎక్కువగా యువకులలో  కనిపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. కాబట్టి బరువు తగ్గించుకునేందుకు తప్పనిసరిగా అందరూ తమ రోజువారీ ఆహారంలో మార్పులు, చేర్పులు  చేసుకోవాలని, వైద్యనిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే..?    

ఇది కూడా చదవండి:  రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మకు కరోనా పాజిటివ్‌ 

అవకాడో.. 
 
కొవ్వును తగ్గించడంలో ఇది అత్యంత ప్రభావవంతమైనది. ఇది మన శరీరంలోని చెడు కొవ్వును మంచి కొవ్వుగా మార్చడంలో సహాయ పడుతుంది. ఇది వేగంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

ఆపిల్.. 

విటమిన్లు, మినరల్స్, ఫైబర్ సమృద్ధిగా ఉన్న ఆపిల్, మీ బరువు తగ్గించడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఉండే ఎలిమెంట్స్ త్వరగా బరువు తగ్గించడంలో ఉపకరిస్తాయి.  

గింజలు.. 

ప్రోటీన్, ఫైబర్ , మంచి కొవ్వుతో కూడిన గింజలు బరువు తగ్గడానికి చాలా ముఖ్యమైనవి, ఇవి అంతర్గత పోషణతో పాటు బరువు తగ్గడంలో మంచి పనితీరును కనబరుస్తాయి.

మిక్స్‌డ్ వెజిటబుల్ సూప్.. 

మిక్స్‌డ్ వెజిటబుల్ సూప్, టొమాటో సూప్, క్యారెట్ సూప్, క్యాప్సికమ్ బ్రోకలీ సూప్ వంటి అనేక రకాల సూప్‌లు బరువు తగ్గడానికి సహాయపడతాయి. ఇది ఉత్తమమైన, ఆరోగ్యకరమైన పోషకాహారం. ఈ సూప్ బరువు తగ్గించడంలో కీలక పాత్ర పోషస్తుంది. అలాగే, ఇందులో ఉండే కూరగాయలు, నీరు, శరీరాన్ని నిర్విషీకరణ చేసి ఇది బరువు తగ్గడానికి సహాయపడుతాయి. 
 
గంజి..  

మల్టీగ్రెయిన్ గంజి, బార్లీ గంజి లేదా గోధుమ గంజి బరువు తగ్గడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఇందులో ఉండే అధిక ప్రొటీన్, పీచు పదార్థాలు శరీరాన్ని దృఢంగా ఉంచడమే కాకుండా డిటాక్సిఫికేషన్ చేస్తుంది.

ఇది కూడా చదవండి: పారట్ ఫీవర్ అంటే ఏమిటి..? ఎలా వ్యాపిస్తుంది..? 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.