పారట్ ఫీవర్ అంటే ఏమిటి..? ఎలా వ్యాపిస్తుంది..?
సాక్షి లైఫ్ : ఐరోపాలోని పలు దేశాల్లో పారట్ ఫీవర్ విధ్వంసం సృష్టిస్తోంది. దీని కారణంగా ఐదుగురు మృతి చెందారు. యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం. ఈ వ్యాధి సోకిన జంతువులను తినడం ద్వారా వ్యాపించదు. అవి శ్వాస వదిలినప్పుడు లేదా మలవిసర్జన చేసినప్పుడు వెలువడే బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.
2023లో కూడా..
"పారట్ ఫీవర్" ను "సిట్టాకోసిస్" అని కూడా అంటారు. ఐరోపా దేశాల్లో పలు ప్రాంతాల్లో ఈ వ్యాధి బారీన పడుతున్నవారి సంఖ్య మరింతగా పెరుగుతోంది. ఇప్పటికే ఈ పారట్ ఫీవర్ సోకి ఐదుగురు చనిపోయారు. 2023 సంవత్సరం విధ్వంసం సృష్టించిన ఈ వ్యాధి ఇప్పుడు 2024 సంవత్సరంలో ఐదుగురి ప్రాణాలను బలిగొంది.
ఇది కూడా చదవండి: ఆ మూడు రాష్ట్రాల్లో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు..
ఎక్కడెక్కడ ఎన్ని కేసులు బయటపడ్డాయి..?
సాధారణంగా సంవత్సరానికి రెండు కేసులు మాత్రమే వచ్చే ఆస్ట్రియాలో 2023 సంవత్సరంలో 14 పారట్ ఫీవర్ కేసులు వచ్చాయి. ఈ సంవత్సరం మార్చి 4 తేదీ నాటికి అదనంగా నాలుగు కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 27 నాటికి డెన్మార్క్‌లో ఈ వ్యాధి కేసులు 23 వచ్చినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. డెన్మార్క్‌లో ఒక వ్యక్తికి రాగా, ఈ ఏడాది జర్మనీలో ఐదు కేసులు నమోదయ్యాయి.
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం.. ఈ వ్యాధి సోకిన జంతువులను తినడం ద్వారా వ్యాపించదు. ఇటీవలి కేసుల్లో ఎక్కువగా పెంపుడు జంతువులు లేదా అడవి పక్షులతో పరిచయం ఉన్నవారేనని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలిపింది.
పారట్ ఫీవర్ అంటే ఏమిటి..?
"పారట్ ఫీవర్" క్లామిడియా ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఇది వివిధ రకాల అడవి, పెంపుడు పక్షులు,కోళ్లలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వ్యాధి సోకిన పక్షులు అనారోగ్యంగా కనిపించకపోవచ్చు, కానీ అవి శ్వాస వదిలినప్పుడు లేదా మలవిసర్జన చేసినప్పుడు వెలువడే బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందడానికి కారణమని పరిశోధకులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మకు కరోనా పాజిటివ్
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
