Eye Beauty Trends : ఇలాంటి 'ఐ బ్యూటీ ట్రెండ్స్'తో పొంచి ఉన్న ముప్పులు ఇవిగో ..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : సోషల్‌ మీడియా రీల్స్‌లో ఆకర్షణీయంగా కనిపించాలన్నా, వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవాలన్నా కళ్లకు రంగులద్దడం నేటి తరం ఫ్యాషన్‌గా మారింది. కృత్రిమ రెప్పలు (Fake Lashes & Extensions), రంగురంగుల కాంటాక్ట్ లెన్స్‌లు, కనురెప్పల ఎదుగుదలకు వాడే సీరమ్స్‌ వినియోగం విపరీతంగా పెరిగింది. అయితే కళ్లను తాత్కాలికంగా అందంగా చూపించే ఈ బ్యూటీ ట్రెండ్స్‌ దీర్ఘకాలంలో దృష్టిలోపాలు, అంధత్వానికి దారితీసే ప్రమాదం ఉందని కంటివైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

1. కృత్రిమ కనురెప్పలు (Fake Lashes & Extensions)..

కనురెప్పలు ఒత్తుగా కనిపించేందుకు అతికించే ఫేక్ ఐల్యాషెస్‌ వల్ల కంటికి ఇన్ఫెక్షన్లు వచ్చే ముప్పు ఎక్కువ. హానికరమైన గ్లూ.. ఈ రెప్పలను అతికించడానికి వాడే జిగురులో ఫార్మాల్డిహైడ్, రసాయన పదార్థాలు ఉంటాయి. ఇవి కంటి సున్నితమైన చర్మంపై అలెర్జీ, మంట, వాపును కలిగిస్తాయి.

సహజ రెప్పలు రాలిపోవడం..కృత్రిమ రెప్పలను పదేపదే తొలగించే క్రమంలో సహజసిద్ధమైన కనురెప్పల వెంట్రుకలు శాశ్వతంగా రాలిపోయే ప్రమాదం ఉంది. బ్యాక్టీరియా చేరిక.. ఈ ఎక్స్‌టెన్షన్స్ మధ్యలో దుమ్ము, బ్యాక్టీరియా సులభంగా చేరి 'బ్లెఫరైటిస్' అంటే కనురెప్పల వాపు వ్యాధికి దారితీస్తుంది.

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

 

2. కలర్డ్ కాంటాక్ట్ లెన్స్..

ప్రిస్క్రిప్షన్ లేకుండా మార్కెట్లో లేదా ఆన్‌లైన్‌లో దొరికే నాసిరకం రంగుల లెన్స్‌లను వాడటం కంటికి అత్యంత ప్రమాదకరం. నాసిరకం లెన్స్‌లు కంటి నల్లగుడ్డు (cornea)కు గాలి, ఆక్సిజన్ అందకుండా అడ్డుకుంటాయి. దీనివల్ల కళ్లు తీవ్రంగా పొడిబారతాయి.లెన్స్‌లను సరైన పద్ధతిలో శుభ్రపరచకపోవడం, రాత్రి వేళల్లో పెట్టుకుని పడుకోవడం వల్ల కార్నియాపై పుండ్లు, తీవ్రమైన ఇన్ఫెక్షన్లు ఏర్పడి దృష్టి కోల్పోయే ప్రమాదం ఉంది.

3. లాష్-గ్రోత్ సీరమ్స్ (Lash-Growth Serums)..

కనురెప్పల ఎదుగుదల కోసం వాడే కొన్ని రకాల సీరమ్‌లలో ఉండే హార్మోన్ల సమ్మేళనాలు దీర్ఘకాలిక సమస్యలకు కారణమవుతాయి.
ఇవి కంటి చుట్టూ ఉండే సున్నితమైన చర్మాన్ని నల్లగా మార్చడమే కాకుండా, ఒక్కోసారి ఐరిస్ అంటే కంటి నల్లగుడ్డు రంగును శాశ్వతంగా నల్లబరిచే అవకాశం ఉంది.

ఈ సీరమ్స్ ప్రభావంతో కంటి గుంతల చుట్టూ ఉండే కొవ్వు కరిగిపోయి, కళ్లు లోపలికి పీక్కుపోయినట్లుగా కనిపించే ప్రమాదం ఉంది. కళ్లు శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు. సరైన నాణ్యత లేని కాస్మెటిక్స్, వైద్యుల సలహా లేని కాంటాక్ట్ లెన్స్‌లు కంటి కార్నియాను దెబ్బతీసి శాశ్వత నష్టాన్ని కలిగిస్తాయని వైద్య నిపుణుల హెచ్చరిస్తున్నారు.

కంటి సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

సర్టిఫైడ్ లెన్స్‌లే వాడండి: రంగుల లెన్స్‌లు వాడాలనుకుంటే తప్పనిసరిగా నేత్ర నిపుణుల సలహాతో నాణ్యమైన బ్రాండ్లను మాత్రమే ఎంచుకోవాలి. నిద్రించే ముందు వాటిని తప్పక తొలగించాలి. మేకప్‌తో నిద్రపోవద్దు.. రాత్రి పడుకునే ముందు కంటి మేకప్‌ను మైడ్ క్లెన్సర్‌తో పూర్తిగా శుభ్రం చేసుకోవాలి.

పరిశుభ్రత తప్పనిసరి..కంటికి వాడే బ్రష్‌లు, ఐల్యాష్ కర్లర్లను క్రమం తప్పకుండా శుభ్రపరచాలి. ఇతరుల కాస్మెటిక్స్ లేదా లెన్స్‌లను ఎప్పుడూ పంచుకోకూడదు. లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు..కళ్లు ఎర్రబడటం, నీరు కారడం, దురద, నొప్పి లేదా చూపు మసకబారడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే బ్యూటీ ప్రొడక్ట్స్‌ వాడటం ఆపి, నేత్ర నిపుణులను సంప్రదించాలి.

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.