Stay Healthy : వాతావరణంలో మార్పుల సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : అక్టోబర్ నెల రాకతో రుతుపవనాలు వీడ్కోలు పలుకుతూ, శీతాకాలం మెల్లగా పలకరిస్తోంది. ఉదయం, రాత్రి వేళల్లో చల్లదనం.. మధ్యాహ్నం వేళ ఎండ తీవ్రతతో ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఇలాంటి వాతావరణ మార్పుల సమయంలో రోగనిరోధక శక్తి కాస్త మందగించి జలుబు, దగ్గు, గొంతునొప్పి, అలర్జీలు, వైరల్ జ్వరాలు చుట్టుముట్టే ప్రమాదం ఎక్కువ. కాస్త అప్రమత్తంగా ఉంటూ జీవనశైలిలో చిన్నపాటి మార్పులు చేసుకుంటే ఈ కాలంలోనూ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు.. 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 

తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు..

మంచి నీళ్లు తాగడం మానొద్దు..

వాతావరణం చల్లబడేకొద్దీ దాహం వేయడం తగ్గుతుంది. అలాగని నీళ్లు తాగడం తగ్గిస్తే శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. రోజంతా తగినంత గోరువెచ్చని నీటిని, సూప్‌లు లేదా పండ్ల రసాలను తీసుకుంటూ ఉండాలి.

పౌష్టికాహారానికి ప్రాధాన్యం..

 రోగనిరోధక శక్తిని పెంచే తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. నూనెలో వేయించిన పదార్థాలు, నిల్వ ఉంచిన తినుబండారాలు, అతి చల్లని పానీయాలకు దూరంగా ఉండటం మేలు.

దుస్తుల విషయంలో జాగ్రత్త..

 ఉదయం, సాయంత్రం వేళల్లో చలిగాలి తగలకుండా అవసరమైతే తేలికపాటి స్వెట్టర్లు లేదా పూర్తి చేతుల దుస్తులు ధరించాలి. బయటకు వెళ్లేటప్పుడు వెంట ఒక తేలికపాటి శాలువా లేదా జాకెట్ ఉంచుకోవడం మంచిది. నిద్రలేమి నేరుగా రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీస్తుంది. రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల ప్రశాంతమైన నిద్ర ఉండేలా చూసుకోవాలి. వైరస్‌లు వేగంగా వ్యాపించే సమయమిది. బయటి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత, భోజనానికి ముందు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం అలవాటు చేసుకోవాలి.

దుమ్ము, ధూళికి దూరం..

 అలెర్జీ, తుమ్ములు, ఆస్తమా సమస్యలు ఉన్నవారు దుమ్ము, పొగ, పుప్పొడి రేణువులు ఉండే ప్రాంతాల్లో తిరగకపోవడం ఉత్తమం. బెడ్‌షీట్లు, కర్టెన్లను క్రమం తప్పకుండా ఉతుకుతూ ఇంట్లో పరిశుభ్రత పాటించాలి.

ఎలాంటి వారికి ఇబ్బంది..?

చిన్నారులు, వృద్ధులలో రోగనిరోధక శక్తి కాస్త బలహీనంగా ఉండటం వల్ల వాతావరణ మార్పుల ప్రభావం త్వరగా పడుతుంది. గర్భిణుల శరీరంలో వచ్చే మార్పుల వల్ల వీరు ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఎక్కువ.  ఆస్తమా, శ్వాసకోశ సమస్యలు, గుండె జబ్బులతో బాధపడేవారు చలిగాలికి నేరుగా గురికాకుండా ఉండాలి.

తీవ్రమైన జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఎడతెగని దగ్గు లేదా ఛాతీలో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే సొంత వైద్యం చేసుకోకుండా తక్షణమే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి..గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.