సాక్షి లైఫ్ : పైనాపిల్, తీపి, పులుపు రుచితో పసుపు రంగుతో ఆకర్షణీయంగా ఉండే పండు, ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. పైనాపిల్లో ఉన్న బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ప్రోటీన్లను జీర్ణ వ్యవస్థలో సులభంగా జీర్ణమయ్యెనుదుకు సహాయపడుతుంది. ఇది మలబద్ధకాన్ని తగ్గించి, జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
ఇది కూడా చదవండి..పేస్‌మేకర్ హార్ట్ పేషెంట్లకు ఎప్పుడు అవసరం..?
ఇది కూడా చదవండి..గుండె జబ్బులు రాకుండా ఉండడానికి వైద్య నిపుణులు చెప్పిన చిట్కాలు..
ఇది కూడా చదవండి..గుండె స్పందన తగ్గినప్పుడు కనిపించే లక్షణాలు..
రోగనిరోధక శక్తి..
పైనాపిల్ లో విటమిన్ "సి" అధికంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది శరీరాన్ని వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది.
ఇన్ఫ్లమేషన్ తగ్గుదల..
బ్రోమెలైన్ ఇన్ఫ్లమేషన్ ను తగ్గించే లక్షణాలు కలిగి ఉండటం వల్ల, ఆర్థరైటిస్ వంటి వ్యాధులతోపాటు ఇన్ఫ్లమేషన్ ను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
గుండె ఆరోగ్యానికి మేలు..
పైనాపిల్ లో పొటాషియం, విటమిన్ "సి"ఉండటం వల్ల రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది, తద్వారా హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.
చర్మ ఆరోగ్యానికి ప్రయోజనం..
ఆనాసలోని విటమిన్ "సి" చర్మం కోసం కీలకమైన కాలాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది, ఇది చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా ఉంచుతుంది.
మానసిక ఆరోగ్యానికి మేలు..
పైనాపిల్ లోని "బి" విటమిన్లు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి, మానసిక ఒత్తిడి తగ్గించడంలో ఉపయోగపడతాయి.
పైనాపిల్ ను ఉదయం పరగడుపుతో తినడం ద్వారా దాని పోషక విలువలు శరీరానికి త్వరగా అందుతాయి. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.
పైనాపిల్ లో ఉన్న పులుపు వల్ల కొందరిలో జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు. అలాంటి వారు పరిమితంగా మాత్రమే తినాలి.
పైనాపిల్ ను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా జీర్ణ సమస్యలు, రోగనిరోధక శక్తి లోపించడం, ఇన్ఫ్ల మేషన్, హృదయ సంబంధిత వ్యాధులు, చర్మ సమస్యలు, మానసిక ఒత్తిడి వంటి అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు.
ఇది కూడా చదవండి..హిమోగ్లోబిన్ పెంచే బెస్ట్ ఫుడ్..?
ఇది కూడా చదవండి..కొత్తిమీర ఆరోగ్యానికి ఒక అద్భుతమైన ఔషధం..
ఇది కూడా చదవండి..గుండె జబ్బులు పెరగడానికి ఇవే కారణం..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com