హై టెంపరేచర్స్ : షుగర్, బీపీ ఉన్నవాళ్లు తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..   

షేర్ చేయండి:
హై టెంపరేచర్స్ : షుగర్, బీపీ ఉన్నవాళ్లు తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..   

సాక్షి లైఫ్ : వేసవికాలం ముగియనున్న నేపథ్యంలో దేహ్స్వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. దీని కారణంగా ఉష్ణోగ్రతలు ఎన్నడూ లేనివిధంగా పెరుగుతున్నాయి. కొన్ని చోట్ల 50 డిగ్రీలకుపైగా  ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.  తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవడంతో అనారోగ్య సమస్యలు ఉన్నవారు తమ ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ పెట్టాలని  వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎండాకాలపు వేడి, మధుమేహం, గుండె జబ్బులు, ఉబ్బసం, క్యాన్సర్ వంటి సమస్యలు ఉన్నవారికే కాక ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి కూడా అవి పెరిగేలా అనుకూల పరిస్థితులను కల్పిస్తుంది. 

 ఇది కూడా చదవండి.. కాలేయ సమస్యలున్న వాళ్ళు కాఫీలు, టీలు తాగకూడదా..? 

 దాహం.. 

ఈ ఎండాకాలపు వేడిలో, షుగర్ సమస్యలు ఉన్నవారు తమ రక్తంలోని చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండేలా చూసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. చెమటలు పట్టడంతోపాటు దాహంగా అనిపిస్తుంది. దీని వల్ల శరీరం డీహైడ్రేషన్‌కి గురయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి రోజంతా తరచుగా నీటిని తీసుకొంటూ శరీరానికి నీటి కొరత లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. అస్సలు చక్కెర కలపని లేదా తీపి తక్కువున్న పానీయాలను తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా చేసుకోవచ్చు. 

 

పగలు.. 

పగలు ఎండలేని సమయాల్లో మాత్రమే బయటికి వెళ్ళి తమ పనులను పూర్తి చేసుకోవడం, శరీరానికి గాలి బాగా ఆడే బట్టలను వేసుకోవడం లాంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా శరీర ఉష్ణోగ్రతలు పెరగకుండా ఆరోగ్యంగా ఉండవచ్చని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. 

ఇది కూడా చదవండి.. పిల్లలలో థైరాయిడ్ లక్షణాలు ఎలా ఉంటాయి..?  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.