ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి ఎన్నిగుడ్లు తినాలి..?
సాక్షి లైఫ్ : చలికాలంలో శరీరాన్ని లోపలి నుంచి వెచ్చగా ఉంచే, ఆరోగ్యంగా ఉండటానికి తరచుగా తమ ఆహారంలో కొన్ని ఆహారాలను చేర్చుకుంటారు. అటువంటి వాటిలో గుడ్లు ఒకటి. ఇవి చాలా మంది తినడానికి ఇష్టపడే ఆహారంలో ముఖ్యమైనవి. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే..ఎక్కువ గుడ్లు తినొచ్చా..? రోజుకి ఎన్ని తినాలి..? గుడ్లు ఎక్కువగా తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
గుడ్లలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి అద్భుతమైన ఎంపికగా పరిగణిస్తారు. అందుకే దీన్ని ఆహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. గుడ్లు అనేక సమస్యలను దూరం చేయడంలో సహాయపడతాయని చెబుతున్నారు పోషకాహారనిపుణులు. ముఖ్యంగా చలికాలంలో గుడ్లను తినడం వల్ల శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి, అయితే వీటిని ఎక్కువ పరిమాణంలో తినడం వల్ల ప్రయోజనాలకు బదులుగా హాని కలుగుతుందని మీకు తెలుసా..?
ఏదైనా మితిమీరితే ఆరోగ్యానికి హాని కలుగుతుందని అంటారు. గుడ్లు తినే విషయంలో కూడా అదే పరిస్థితి. మీరు ఆరోగ్యంగా ఉండేందుకు రోజూ గుడ్లు ఎక్కువగా తింటే పలురకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
జీర్ణ సమస్యలు..
గుడ్లు ఎక్కువగా తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. దీని వల్ల కొందరికి గ్యాస్, కడుపునొప్పి, అజీర్తి వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అధిక కొవ్వు పదార్ధాలతో తినడం వల్ల మలబద్ధకం ఏర్పడుతుంది.
అలెర్జీలకు కారణం..
గుడ్లు అలర్జీకి కారణమవుతాయి. ఈ సమస్య అందరిలో ఒకేలా ఉండకపోవచ్చు. ఎక్కువ పరిమాణంలో గుడ్లు తినడం వల్ల తీవ్రమైన అనాఫిలాక్సిస్‌తో సహా అలెర్జీ రియాక్షన్స్ కు కారణమవుతుంది. దీని కారణంగా దద్దుర్లు, వాపు, తామర, జీర్ణ సంబంధిత సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ముక్కు కారడం, కళ్ళు ఎర్రగా లేదా నీరు కారడం, ముక్కు దిబ్బడ, మైకము లేదా ఛాతీ బిగుతుగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి. అలాగే, గుడ్లు తిన్న తర్వాత మీకు ఈ లక్షణాలు కనిపిస్తే, వాటిని తీసుకోక పోవడం ఉత్తమం.
రోజుకు ఎన్ని గుడ్లు తింటే మంచిది..?
హార్వర్డ్ మెడికల్ స్కూల్ డేటా ప్రకారం, రోజూ గుడ్డు తినడం వల్ల ఎటువంటి హాని జరగదు. అయితే, కొంతమంది గుడ్లు ఎక్కువగా తినకూడదు. ఎలాంటివారంటే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు, ఇలాంటి వాళ్లు వారానికి 2 లేదా 3 గుడ్లు తినాలి. అదే గుండె జబ్బులు ఉన్నవారు అయితే వారానికి 3 లేదా 4 గుడ్లు కంటే ఎక్కువ తినకూడదు. మధుమేహంతో బాధపడేవారు వారానికి 5 గుడ్లు తీసుకోవచ్చు.
ఇది కూడా చదవండి..ప్లేట్‌లెట్ కౌంట్ ను ఎలా పెంచుకోవచ్చు..?
ఇది కూడా చదవండి..థ్రోంబోసైట్లు అంటే ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
