ప్రపంచంలో కలుషిత ఆహారం తిని ఎంతమంది చనిపోతున్నారంటే..?
సాక్షి లైఫ్: "ఆహార పదార్థాల కల్తీ".. కొన్ని పదార్ధాలను కలపడం ద్వారా ఆహారం లేదా ఆహార పదార్థాలను కలుషితం చేసే పద్ధతిగా నిర్వచించవచ్చు, దీనినే కల్తీ అని కూడా అంటారు. ఆర్థిక, సాంకేతిక ప్రయోజనాల కోసం ఆహార పదార్థాలకు కల్పిన పదార్థాలు లేదా నాణ్యత లేని ఉత్పత్తులను తయారు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి.. నాలుక శుభ్రం చేసుకోకపోతే ఏమౌతుంది..?
కల్తీ పదార్థాలను కలపడం వల్ల ఆహారంలో పోషకాల విలువ తగ్గుతుంది. పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు, పప్పులు, ధాన్యాలు, మాంసం, కూరగాయలు, పండ్లు, నూనెలు, పానీయాలు మొదలైన వాటితో సహా మనం రోజూ తినే అన్ని ఆహార ఉత్పత్తులలో కల్తీ పదార్థాలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి.. ప్రొస్టేట్ గ్రంథిలో వాపు వచ్చినప్పుడు.. ఏం జరుగుతుంది..?
ఆహార భద్రత, పోషకాహారం విడదీయరానివి. ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి. ప్రతిరోజూ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.6 మిలియన్ల మంది ప్రజలు కలుషితమైన ఆహారం తినడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారు. దీని వల్ల ప్రతి సంవత్సరం 4,20,000 మంది చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
