ప్రొస్టేట్ గ్రంథిలో వాపు వచ్చినప్పుడు.. ఏం జరుగుతుంది..?
సాక్షి లైఫ్ : మగాళ్లలో పురుషత్వాన్ని కల్గించే గ్రంథి ఒకటుంది. దాన్ని ప్రొస్టేట్ గ్రంథి అంటారు. లైంగిక జీవితం ముగిసిపోయిన తర్వాత ఇంక ఈ గ్రంథితో అవసరం లేదనే పరిస్థితి వచ్చాక ఈ గ్రంథిలో వాపు ఏర్పడి అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కొందరిలో మధ్య వయసులోనే, ఇంకా ముందుగా కూడా వచ్చే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
పౌరుషగ్రంథి..
దీన్ని పౌరుషగ్రంథి అంటారు. నపుంసకులలో ఈ గ్రంథి పరిణతి చెందకుండా వుండిపోతుంది. కాబట్టి వాళ్ళలో ప్రొస్టేట్ గ్రంథివాపు ఏర్పడదు. ఏర్పడినా వ్యాధి లక్షణాలు వచ్చేంత స్థాయిలో వుండదు.
ప్రొస్టేట్ గ్రంథి వాచినందులన, దానిపైన వుండే మూత్రాశయం నొక్కుకుని, అందులో మూత్రం నిలవవుండే చోటు తగ్గిపోయి మాటి మాటికీ మూత్రానికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది.
ఇది కూడా చదవండి.. World Liver Day : కాలేయ వ్యాధులకు కారణాలు
-వెళ్లాలనిపించటమే తరువాయి ఆపుకో లేకపోవటం జరుగుతుంది.
-పరుగుల మీద బాత్రూంలోకి వెళ్లాక మూత్రం ఎంత ప్రయత్నించినా రాకపోవటం, చాలాసేపటికి కొద్దిగా వస్తూంటుంది.
-కాసేపు వేచివుండి, పడుకోవటానికి వెళ్ళిపోయాక వెంటనే మళ్ళీ హడావిడిగా మూత్రానికి వెళ్ళాల్సి రావటం
బాత్రూంకు ఎక్కువ సార్లు వెళ్లాల్సిన పరిస్థితి ఈ ప్రొస్టేట్ వాపులో వుంటుంది.
మూత్రం ధార, వేగం తగ్గిపోయి ఆగి ఆగినడుస్తూ, చివరిలో బొట్టు బొట్టుగా నెమ్మదిగా మూత్రం అయ్యే లక్షణం కన్పిస్తే వెంటనే వైద్యుని సంప్రదించడం ఉత్తమం.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. లివర్ డ్యామేజ్ అయితే ఏం జరుగుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
