బ్రష్ చేసేటప్పుడు టూత్‌పేస్ట్ ఎంత ఉపయోగించాలి..?
సాక్షి లైఫ్ : ప్రతి ఒక్కరూ దంతాలను శుభ్రం చేసుకోవడానికి టూత్‌పేస్ట్‌ను ఉపయోగిస్తారు. మార్కెట్లో అనేక రకాల టూత్‌పేస్ట్‌లు అందుబాటులో ఉన్నాయి, అవి వాటి ప్రయోజనాల గురించి వేర్వేరు వాదనలు చేస్తాయి, కానీ వాటిని ఎక్కువగా వాడడం వల్ల దంతాలు, చిగుళ్ళకు అస్సలు సురక్షితం కాదని మీకు తెలుసా..? అవును, ఇది మీ నోటి ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుంది.
ఇది కూడా చదవండి..ఎలాంటి వారిపై షింగిల్స్ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంటుంది..?
ఇది కూడా చదవండి..స్ట్రోక్ కు ప్రధాన కారణాలు..? నివారణ ఎలా..?
ఇది కూడా చదవండి..కిడ్నీడ్యామేజ్ అయ్యే ముందు కనిపించే 5 లక్షణాలు..
మంచి నోటి ఆరోగ్యం కోసం ఉదయం నిద్రలేచిన తర్వాత, రాత్రి పడుకునే ముందు బ్రష్ చేసుకోవడం మంచిది. ఇది మీ దంతాలు, చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది. రాత్రిపూట నోటిలో పెరిగే బ్యాక్టీరియాను కూడా తొలగిస్తుంది. బ్రష్ చేసేటప్పుడు మీరు ఎంత ఎక్కువ టూత్‌పేస్ట్ వేసుకుంటే, మీ దంతాలు అంత బాగా శుభ్రం అవుతాయని మీరు అనుకుంటున్నారా? ఎక్కువ టూత్‌పేస్ట్ వేసుకోవడం వల్ల ప్రయోజనాలకు బదులు, హాని జరుగుతుందని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి.
ఎంత టూత్‌పేస్ట్ వేసుకోవడం సురక్షితం..?
దంతాలు తోముకునేటప్పుడు, టూత్‌పేస్ట్ ఎంత వేసుకోవాలనేదానిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. బ్రష్‌పై బఠానీ పరిమాణంలో టూత్‌పేస్ట్‌ను అప్లై చేస్తే సరిపోతుందని నిపుణుల అభిప్రాయ పడుతున్నారు. ఈ పరిమాణంతోనే దంతాలు పూర్తిగా శుభ్రం అవుతాయి. పిల్లలు పళ్ళు తోముకునేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. వీలైనంత వరకూ టూత్‌పేస్ట్ తక్కువ పరిమాణంలో మాత్రమే వాడాలి. అధికంగా వాడటం హానికరం. టూత్‌పేస్ట్ ఎంత ఎక్కువగా వాడితే అంతగా మీ దంతాలు, చిగుళ్లు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
