Curry Leaves for Amazing Health Benefits : కరివేపాకును ఎలా తీసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చంటే..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్: భారతీయ వంటకాల్లో పోపు అనగానే ముందుగా గుర్తొచ్చేది కరివేపాకు. కేవలం సువాసన, రుచి కోసమే కాకుండా.. ఆరోగ్య రక్షణలోనూ దీని పాత్ర అనన్యం. చాలామంది ఆహారంలో కరివేపాకు వస్తే పక్కన పెట్టేస్తుంటారు. కానీ, ఆయుర్వేదంలో దీనిని ఒక గొప్ప ఔషధంగా పరిగణిస్తారు. కరివేపాకులో విటమిన్ ఎ, బి, సి, ఇ లతో పాటు ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. నిత్యం కరివేపాకును మన ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం..

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం.. 

ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..

 

1. జీర్ణక్రియ మెరుగుపడుతుంది..

కరివేపాకులో ఉండే పీచుపదార్థం ఇతర సహజ సమ్మేళనాలు జీర్ణవ్యవస్థను చురుగ్గా ఉంచుతాయి. ఇది గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్ణం,మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

2. మధుమేహం నియంత్రణ..

కరివేపాకు శరీరంలో ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు (Blood Sugar Levels) అదుపులో ఉంటాయి. మధుమేహ బాధితులకు ఇది ఎంతగానో మేలు చేస్తుంది.

3. గుండె ఆరోగ్యానికి.. కొలెస్ట్రాల్ తగ్గింపు..

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించడంలో కరివేపాకు అద్భుతంగా పనిచేస్తుంది. ఇది రక్తనాళాల్లో కొవ్వు చేరకుండా చూస్తూ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

జుట్టు సంరక్షణలో మేటి..!

కరివేపాకు జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తుంది. చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం సమస్యను అడ్డుకోవడమే కాకుండా, జుట్టు రాలడాన్ని తగ్గించి ఒత్తుగా పెరిగేలా దోహదపడుతుంది.

4. బరువు తగ్గడం, టాక్సిన్స్ తొలగింపు..

శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను, విషపదార్థాలను బయటకు పంపడంలో (Detoxification) కరివేపాకు సహాయపడుతుంది. ఇది శరీర జీవక్రియను (Metabolism) వేగవంతం చేసి, అదనపు కొవ్వును కరిగించి బరువు తగ్గేలా చేస్తుంది.

5. కంటి చూపు మెరుగుపడుతుంది..

ఇందులో లభించే విటమిన్ 'ఎ' కంటి ఆరోగ్యానికి ఎంతో అవసరం. రేచీకటి సమస్య రాకుండా చూడటంతో పాటు, దృష్టి లోపాలను నివారించడంలో ఇది తోడ్పడుతుంది.

6. రక్తహీనతకు చెక్..

కరివేపాకులో ఐరన్, ఫోలిక్ యాసిడ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. రక్తహీనత (anemia) సమస్యతో బాధపడేవారు దీనిని క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది.

కరివేపాకును ఎలా తీసుకోవాలి..?

ఉదయాన్నే పరగడుపున..రోజూ ఉదయం ఖాళీ కడుపుతో 7 నుంచి 10 తాజా కరివేపాకులను బాగా నమిలి మింగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

కరివేపాకు టీ.. నీటిని బాగా మరిగించి అందులో కరివేపాకు వేసి కొద్దిసేపు ఉంచి, ఆ నీటిని వడకట్టి టీలా తాగవచ్చు.

పొడి రూపంలో..ఎండబెట్టిన కరివేపాకులతో కారప్పొడిలా తయారు చేసుకుని రోజూ అన్నంలో మొదటి ముద్దగా తినవచ్చు.

వంటల్లో..పప్పు, సాంబార్, ఉప్మా, కూరల్లో కరివేపాకును కేవలం సువాసనకే పరిమితం చేయకుండా పూర్తిగా తినేయడం అలవాటు చేసుకోవాలి.

మనకు పెరట్లోనే సులభంగా లభించే ఈ కరివేపాకును నిత్యం వాడటం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి చర్మం కూడా కాంతివంతంగా మారుతుంది. ఇప్పటికైనా ఆహారంలో కరివేపాకును పక్కన పడేసే అలవాటును మార్చుకుందాం.. ఆరోగ్యాన్ని కాపాడుకుందాం..!

 

ఇది కూడా చదవండి..Chest Pain : ఛాతీలో నొప్పా..? అది గుండెపోటా..? లేక పానిక్ అటాకా..? తేడా ఎలా గుర్తించాలి..?

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..? 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.