Natural Protein : సప్లిమెంట్స్ తో పని లేకుండానే రోజుకు100 గ్రాప్రోటీన్ పొందొచ్చు ఇలా..
సాక్షి లైఫ్ : శాఖాహారులు తమకు అవసరమైన ప్రోటీన్ ను పొందాలంటే కొన్నిరకాల ఆహారాలనే తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా కండర పుష్టి కావాలన్నా, శరీరానికి సరైన పోషణ అందాలన్నా మాంసాహారం తప్పనిసరని చాలామంది భావిస్తుంటారు. అయితే, సరైన ప్రణాళికతో శాఖాహారం ద్వారా కూడా రోజుకు 100 గ్రాములకు పైగా ప్రోటీన్‌ను సులభంగా పొందవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఎటువంటి ప్రోటీన్ పౌడర్లు, సప్లిమెంట్లు వాడకుండానే ఇంట్లోనే దొరికే పదార్థాలతో గుండె పదిలంగా, శరీరం దృఢంగా మార్చుకునే మార్గాలు ఇవీ..
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..Brain health : మీ బ్రెయిన్ కంప్యూటర్ లాగా పనిచేయాలంటే ఈ ఆహారపదార్థాలు తినండి..
ఇది కూడా చదవండి..Prediabetes : ప్రీడయాబెటిస్ కు గుండె జబ్బుల ప్రమాదానికి లింక్ ఏంటి..?
కీలకమైన 'ప్రోటీన్' బాంబులు ఇవే..!
శాకాహారంలో ప్రోటీన్ శాతం పుష్కలంగా ఉండే ఆహారపదార్థాల జాబితా..
సోయా చంక్స్ (Soy Chunks): శాఖాహారంలో ఇది అత్యధిక ప్రోటీన్ ఇచ్చే మూలం. 100 గ్రాముల్లో సుమారు 52 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.
పనీర్ (Paneer): 100 గ్రాముల పనీర్‌లో 18-20 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది.
కాయధాన్యాలు (Lentils/Dals): ఒక కప్పు వండిన పప్పులో సుమారు 14-18 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.
నట్స్ & సీడ్స్: బాదం, వేరుశనగలు, గుమ్మడి గింజలు (Pumpkin seeds) మంచి ప్రోటీన్ వనరులు.
100 గ్రాముల ప్రోటీన్ కోసం నమూనా డైట్ ప్లాన్..
రోజువారీ ఆహారంలో చిన్న మార్పులు చేయడం ద్వారా లక్ష్యాన్ని చేరుకోవచ్చు.
ఉదయం..పెసరట్టు (Moong dal chilla) లేదా మొలకెత్తిన గింజలతో పాటు గ్లాసు పాలు తీసుకోవాలి.
మధ్యాహ్నం..అన్నానికి బదులుగా క్వినోవా లేదా బ్రౌన్ రైస్, ఒక కప్పు పప్పు, పనీర్ లేదా సోయా కూర.
సాయంత్రం.. గుప్పెడు వేరుశనగలు లేదా బాదం పప్పులు, గ్రీక్ యోగర్ట్.
రాత్రి.. జొన్న రొట్టెలు, రాజ్మా లేదా శనగల కూరతో పాటు ఒక కప్పు పెరుగు.
'కాంబినేషన్' ముఖ్యం..
కేవలం ఒక్క రకమైన పప్పు మీద ఆధారపడకుండా, పప్పుతో పాటు తృణధాన్యాలను ఉదాహరణకు పప్పు-అన్నం లేదా పప్పు-రొట్టె కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన 9 రకాల అమైనో ఆమ్లాలు అందుతాయి. దీనివల్ల ప్రోటీన్ గ్రహించే శక్తి పెరుగుతుంది. ప్రోటీన్ అధికంగా తీసుకున్నప్పుడు జీర్ణక్రియ సజావుగా సాగడానికి తగినంత నీరు తాగడం, పీచు పదార్థం (Fiber) ఉండేలా చూసుకోవడం చాలా అవసరమని పోషకాహారానిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..Obesity and inflammation : ఒబెసిటీకి ఇన్‌ఫ్లమేషన్‌కు లింక్ ఏమిటి..?
ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..
ఇది కూడా చదవండి..Coconut Water : కొబ్బరి బొండం నీళ్లతో బరువు తగ్గొచ్చా..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
