కాలేయ క్యాన్సర్ లక్షణాలను ఎలా గుర్తించవచ్చు అంటే..? 

షేర్ చేయండి:
కాలేయ క్యాన్సర్ లక్షణాలను ఎలా గుర్తించవచ్చు అంటే..? 

సాక్షి లైఫ్ : మన శరీరంలోని అవయవాల్లో అతి ముఖ్యమైనది కాలేయం. నేటి ఆధునిక జీవనశైలి కారణంగా ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల కాలేయానికి సంబంధించిన సమస్యలు పెరిగి పోతున్నాయి. నూనె పదార్థాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయ క్యాన్సర్ ప్రమాదం పెరుగుతోంది. హెపటైటిస్ వంటి ఇన్ఫెక్షన్లు కూడా దీనికి కారణం కావచ్చు.

 

ఇది కూడా చదవండి.. వంట నూనెకు చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి లింక్ ఏంటి..?

 ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

 

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు చాలా సాధారణమైనవిగా కనిపించవచ్చు, వాటిని చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. కానీ సకాలంలో వీటిని గుర్తించడం చాలా అవసరం. లేకపోతే పరిస్థితి తీవ్రంగా మారవచ్చు. కాలేయ క్యాన్సర్ లక్షణాలను ఎలా గుర్తించాలో ఇప్పుడు చూద్దాం.

 పొట్ట పైభాగంలో నొప్పి లేదా వాపు.. 

పొట్ట కుడి వైపున, పక్కటెముకల కింద నిరంతరంగా నొప్పి, బిగుతుగా ఉండటం, లేదా వాపు కనిపిస్తే దాన్ని సాధారణ గ్యాస్ లేదా ఎసిడిటీ అని తేలిగ్గా తీసుకోవద్దు. కణితి పెరగడం వల్ల కాలేయం పరిమాణం పెరిగి చుట్టుపక్కల కణజాలాలపై ఒత్తిడి కలిగించినప్పుడు ఈ నొప్పి వస్తుంది. కొన్నిసార్లు పొట్టలో నీరు చేరడం వల్ల కూడా పొట్ట ఉబ్బినట్లు, భారంగా అనిపించవచ్చు.

 కారణం లేకుండా బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం.. 

డైటింగ్ లేదా వ్యాయామం చేయకుండానే మీ బరువు వేగంగా తగ్గుతున్నా, తినాలన్న కోరిక లేకపోయినా అది ప్రమాదకరమైన సంకేతం కావచ్చు. కాలేయ క్యాన్సర్ శరీర జీవక్రియపై ప్రభావం చూపుతుంది. కాలేయం ఆహారం జీర్ణం కావడానికి సహాయపడుతుంది. క్యాన్సర్ కారణంగా ఈ పనిలో ఇబ్బందులు ఏర్పడతాయి. దీనివల్ల త్వరగా కడుపు నిండినట్లు అనిపించి, ఆహారంపై ఆసక్తి తగ్గుతుంది. ఫలితంగా, శరీరానికి పోషకాలు అందక బరువు తగ్గుతారు.

 కామెర్లు.. 

కామెర్లు కాలేయ క్యాన్సర్ ప్రధాన లక్షణాల్లో ఒకటి. దీనివల్ల చర్మం, కళ్లలోని తెల్ల భాగం, గోళ్లు పసుపు రంగులోకి మారతాయి. కాలేయం సరిగ్గా పని చేయనప్పుడు రక్తంలో బిలిరుబిన్ స్థాయిలు పెరగడం వల్ల ఇలా జరుగుతుంది. దీంతో పాటు, మూత్రం రంగు ముదురు పసుపు లేదా గోధుమ రంగులోకి మారడం, మలం రంగు లేతగా ఉండటం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

 నిరంతర అలసట, బలహీనత.. 

చిన్న పని చేసినా నిరంతరం అలసట, బలహీనత అనిపించడం, విశ్రాంతి తీసుకున్నా తగ్గకపోతే అది ఆందోళన కలిగించే విషయం. కాలేయ క్యాన్సర్ శరీర శక్తి ఉత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. అంతేకాకుండా, ఎర్ర రక్త కణాల ఉత్పత్తిపై కాలేయం ప్రభావం చూపడం వల్ల రక్తహీనత కూడా ఈ అలసటకు ఒక ప్రధాన కారణం కావచ్చు.

 

ఇది కూడా చదవండి.. లేట్ నైట్ లో ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు ఎందుకు..?

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.