సైనసైటిస్ కు కారణాలు..? లక్షణాలను ఎలా గుర్తించాలి..?
సాక్షి లైఫ్ : సైనస్ అనేది ముక్కుకు సంబంధించిన వ్యాధి. ఇది మహిళలకే కాకుండా పురుషులకు కూడా వస్తుంది. ఈ సమస్య కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలుగుతుంది. అంతేకాదు మొహంలోని కండరాలు నొప్పిగా కూడా అనిపిస్తాయి. "సైనస్"ని "సైనసైటిస్" అని , "రైనోసైనసిటిస్" అని కూడా అంటారు. బాక్టీరియా, ఫంగల్, ఇన్ఫెక్షన్, అలెర్జీలు, ముక్కు కండ పెరగడం జరుగుతుంది. ఆస్తమా వల్ల సైనస్ సమస్యలు వస్తాయి.
ఇది కూడా చదవండి: అధిక బరువును నియంత్రించాలనుకుంటే.. ఇలా చేయండి..
సైనసైటిస్ లోని కణజాలాల వాపు వస్తుంది. అంతేకాకుండా ముక్కులోపల నొప్పి, ముక్కు మూసుకుపోవడం లేదా ముక్కు కారటం, కొన్నిసార్లు జ్వరం రావడం కూడా జరుగుతుంది. ఇది జలుబు చేసిన సమయంలో మరింత ఇబ్బంది పెడుతుంది. అయితే ఇతర వైరస్‌లు, బ్యాక్టీరియా, ఫంగస్, అలర్జీలు సైనసైటిస్‌కు కారణమని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
ఇన్ఫెక్షన్, అలెర్జీలు, జలుబు, కెమికల్ ఇరిటేషన్ కారణంగా సైనస్ సంభవిస్తుందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ముఖం వాపు, జ్వరం,చెవులు, దంతాలనొప్పి, ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం కష్టంగా మారడం, గొంతు మంట వంటి లక్షణాలు కనిపిస్తే "సైనసైటిస్" గా పరిగణిస్తారు.
సైనసైటిస్..?
సైనసైటిస్ అంటువ్యాధి కాదు. కానీ దానికి కారణమయ్యే వైరస్లు , బ్యాక్టీరియా లతోనే సైనసైటిస్ సమస్య తలెత్తుతుంది. పరిశుభ్రతను పాటించాలి. చేతులు, ముక్కు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి.
చికిత్స..?
సైనసైటిస్ విషయంలో అవసరమైన టెస్టులు చేయించి చికిత్స తీసుకోవాలి. సమస్య పెద్దది కాకుండానే చికిత్స చేయించుకుంటే మంచిదని, ఒకవేళ చికిత్స తీసుకోవడంలో మరింత ఆలస్యం జరిగితే సైనస్ ఇన్ఫెక్షన్లు ప్రాణాంతక ఇన్ఫెక్షన్లకు దారి తీయవచ్చని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి: పారట్ ఫీవర్ అంటే ఏమిటి..? ఎలా వ్యాపిస్తుంది..?
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..?
రెస్ట్..
ఎక్కువ సేపు కూర్చొని పని చేయడం వల్ల సైనస్ సమస్య తీవ్రమవుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. సైనస్ సమస్య నుంచి త్వరగా ఉపశమనం పొందడానికి, ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.
ఇలా చేస్తే..
సైనస్ సమస్య ఉన్నవారికి తరచుగా ముక్కు కారుతున్న సమయంలో ఆవిరి తీసుకోవడం వల్ల కొంతమేర ఉపశమనం కలుగుతుంది. నాసికా రంధ్రాలు మూసుకుపోయినట్లు అనిపించినా కూడా ఆవిరి పట్టడంవల్ల సమస్య తాత్కాలికంగా కొంత వరకు పరిష్కారం అవుతుంది.
కూల్ గా ఉండేవి..
చల్లని పానీయాలు అస్సలు తీసుకోకూడదు. వేడి పానీయాలు మాత్రమే తీసుకోవడం ఉత్తమం. సైనస్ సమస్య ఉంటే హాట్ వాటర్ తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది. హాట్ వాటర్ తాగడం వల్ల మూసుకుపోయిన ముక్కు క్లియర్ అవుతుంది.
మద్యం సేవించడం వల్ల సైనస్ సమస్యలు మరింతగా పెరుగుతాయి. కాబట్టి పొరపాటున కూడా మద్యం తీసుకోకపోవడం మంచిది. చల్లని గాలి, చల్లని నీరు, చల్లని పదార్థాలకు దూరంగా ఉండడం మంచిదని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు చల్లని నీటితో కూడా తలస్నానం చేయవద్దని వారు చెబుతున్నారు.
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
