రక్త హీనతను ఎలా అధిగమించాలి..? 

షేర్ చేయండి:
రక్త హీనతను ఎలా అధిగమించాలి..? 

సాక్షి లైఫ్ : ఒళ్లంతా నొప్పులు, అరికాళ్లలో మంటలు, కొద్దిదూరం నడిచినా ఆయాసం, చిన్న చిన్న పనులకే అలసట.. ఇవన్నీ రక్తహీనతకు సంకేతం కావచ్చని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. రక్తంలో ఎర్ర రక్తకణాలు తక్కువ కావడాన్నే రక్తహీనతగా పరిగణిస్తారు. మహిళలలో రక్తహీనత సమస్య ఎక్కువకాలం కొనసాగితే రక్తంలో ప్రాణవాయువు తగ్గిపోయి గుండె, మెదడు, ఇతర అవయవాలకు నష్టం జరుగుతుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం  మహిళలు రక్తహీనత బారిన పడుతున్నారు.

 

ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి.. హిమోఫిలియాకు ప్రధాన కారణాలు తెలుసా..?

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..? 

 

ప్రాసెస్ చేసిన ఆహారం, పచ్చళ్లు వంటివాటికి దూరంగా ఉండాలి. లేదంటే వీటిల్లో ఉండే టానిన్ ఇనుమును శరీరం అందుకోకుండా అడ్డుపడుతుంది. అలాగే ఐరన్‌ని మాత్రల రూపంలో తీసుకునేవారు ఖాళీ కడుపుతో వేసుకోవాలి. 

ఇలా చేయడం వల్ల ఆ పోషకం త్వరగా అందుతుంది. లేదంటే పళ్లరసంతో తీసుకోవచ్చు. అదీ కుదరకపోతే టాబ్లెట్ వేసుకున్నతర్వాత విటమిన్ "సి" ఎక్కువగా లభించే జామ, బొప్పాయి, ఆరెంజ్ వంటి పండ్లను తీసుకోవాలి.


మాంసాహార పదార్థాలు.. 
 
 మాంసాహార పదార్థాలైన చికెన్, లివర్, గుడ్డులోని పచ్చసొనల్లో ఇనుము ఎక్కువగా లభిస్తుంది. అదే శాఖాహారులు అయితే వేయించిన సెనగపప్పు, ఉలవలు, బొబ్బర్లు, పెసలు, ఎర్రపప్పులను ఎక్కువగా తీసుకోవాలి. 

గోరుచిక్కుడు.. 

గోరుచిక్కుడులో ఐరన్‌తో పాటు ఫోలిక్ యాసిడ్ కూడా ఎక్కువగా లభిస్తుంది. అలాగే కరివేపాకు, గోంగూర, పుదీన, మెంతికూర, మునగాకు, తోటకూర వంటివాటిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. కరివేపాకు ఏ రూపంలో తిన్నా మంచిదే.. రోజూ చెంచా నువ్వులు, బెల్లం, పల్లీలు తినాలి. 

ఉదాహరణకు రోజూ కనీసం ముప్ఫై గ్రాముల పల్లీలు తినగలిగితే వాటినుంచి 1.5 మిల్లీగ్రాముల ఇనుము శరీరానికి అందుతుంది. ఎండుద్రాక్ష, నల్లద్రాక్ష, ఖర్జూరం వంటివి తినచ్చు. చుక్కకూర, పాలకూర, పుదీనాలలో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. 

 బీ12..  

అలాగే పచ్చి బఠాణి, గోరుచిక్కుడు, కమలాపండు, పప్పుధాన్యాలు వంటి వాటిలో కూడా ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. బీ12 శాఖాహార పదార్థాల నుంచి అందే అవకాశం చాలా తక్కువ. మాంసాహారంలో పీతలు, చేపలు, లివర్, కోడిగుడ్డుతో పాటు కొంత మొత్తంలో పాల పదార్థాలైన చీజ్‌ల నుంచి బీ12 లభిస్తుంది. తక్కువ కేలరీలు కలిగిన పాలు, పెరుగుని ఎక్కువగా తీసుకోవచ్చు.

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.