ప్రోస్టేట్ క్యాన్సర్ ను ఎలా నిరోధించవచ్చు..?
సాక్షి లైఫ్: ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులలో పెరుగుదల చాలా ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. 50 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో ఈ క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. వయసు పెరిగే కొద్దీ ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు కూడా పెరుగుతుంది. ఈ విషయంలో వృద్ధులు ఎక్కువ ప్రమాదంలో ఉన్నారు.
ప్రోస్టేట్ క్యేన్సర్ ప్రపంచవ్యాప్తంగా మధ్య వయస్కుల్లో, వృద్ధుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని లండన్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ రీసెర్చ్ కు చెందిన క్యాన్సర్ రీసెర్చ్ ప్రొఫెసర్ నిక్ జేమ్స్ చెబుతున్నారు. క్యాన్సర్‌ను నిరోధించడానికి, దాని నుండి ప్రజలను సురక్షితంగా ఉంచడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన అంటున్నారు.
ఇది కూడా చదవండి.. సమ్మర్ లో చర్మ సంరక్షణ ఎలా..?
ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు..?
పెరుగుతున్న ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాలను తగ్గించడానికి, దాని నిర్ధారణకు సంబంధించిన కార్యక్రమాలను పెంచాలని, ప్రపంచ స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించడం అవసరమని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ప్రోస్టేట్ క్యాన్సర్ నుంచి సురక్షితంగా ఉండటానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో అందరికీ అవగాహన కలించాలని పరిశోధకులు సూచిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోందని, వృద్ధాప్య జనాభాలో దాని ప్రమాదాలను ఈ అధ్యయనం హెచ్చరిస్తుంది అని క్యాన్సర్ రీసెర్చ్ యూకే డైరెక్టర్ నాసర్ తురాబి చెప్పారు. గత 25 ఏళ్లలో యూకేలో ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు సుమారు 150శాతం పెరిగాయి.
ఎలా నిరోధించవచ్చు..?
ప్రోస్టేట్ క్యాన్సర్‌ను నిరోధించడానికి నిర్దిష్ట మార్గం లేదని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. కానీ వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం వంటివి చేయడం ద్వారా ఈ క్యాన్సర్ ప్రమాదాన్ని కొంతమేర తగ్గించవచ్చని వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే కారకాలు
అధిక బరువు లేదా అధిక బాడీ మాస్ ఇండెక్స్ (BMI) అంటే BMI 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న పురుషులలో ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఊబకాయం ఉన్నట్లయితే, బరువు తగ్గడానికి ప్రయత్నించండి. బరువును నియంత్రించడంతోపాటు, పోషకాహాఆహారాన్ని తీసుకోవడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
