సహజంగా చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించుకోవచ్చంటే..?
సాక్షి లైఫ్ : శరీరానికి మేలు చేసే కొలెస్ట్రాల్, చెడు చేసే కొలెస్ట్రాల్ అనేవి రెండు రకాల కొలెస్ట్రాల్ లున్నాయి. మంచి కొలెస్ట్రాల్ ను హైడెన్సిటీ లిపోప్రోటీన్ (హెచ్‌డిఎల్) అంటారు. ఇది హార్మోన్లు, విటమిన్ డిని ఉత్పత్తి చేస్తుంది. కొవ్వును విచ్ఛిన్నం చేయడానికి పనిచేస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ ప్రభావాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రక్త నాళాల గోడలను బలపరుస్తుంది. అందువల్ల, అన్నిరకాల కొలెస్ట్రాల్స్ తో ఆరోగ్యానికి హానికరం అని నమ్మడం తప్పు.
ఇది కూడా చదవండి.. యునాని ఔషధాలు ఎలా పనిచేస్తాయి..?
అన్ని రకాల కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం కాదు. చెడు కొలెస్ట్రాల్ లోడెన్సిటీ లిపోప్రోటీన్ (ఎల్‌డిఎల్) అని కూడా అంటారు. ఇది గుండె సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి దీనిని తగ్గించుకోవాల్సినవసరం ఎంతైనా ఉందని వైద్యనిపుణులు చెబుతున్నారు. అందుకోసం సహజంగా వీటిని తినడం ద్వారా కూడా చెడు కొలెస్ట్రాల్ సమస్య నుంచి సులువుగా బయటపడొచ్చు.. అదెలాగో తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను చూడండి..
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
