Your Liver at Risk : ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే కాలేయానికి ముప్పే..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మన శరీరంలో నిరంతరం పనిచేస్తూ, ఆరోగ్యాన్ని కాపాడే కీలక అవయవాల్లో కాలేయం (Liver) అత్యంత ముఖ్యమైనది. విష పదార్థాలను బయటకు పంపడం నుంచి రక్తాన్ని శుద్ధి చేయడం వరకు ఇది చేసే పనులు అనేకం. అయితే నేటి ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల కాలేయ వ్యాధులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాలేయ ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..?

 

మన శరీరంలోని అవయవాలన్నింటిలోనూ కాలేయం చాలా ప్రత్యేకమైనది. దీనికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి.. శరీరంలో తనను తాను తిరిగి నిర్మించుకోగల (Regeneration) ఏకైక అవయవం కాలేయం మాత్రమే. ఒక భాగం దెబ్బతిన్నా, అది మళ్ళీ పెరుగుతుంది.

రెండవ అతిపెద్ద అవయవం..  
 
 1.2 నుంచి 1.5 కిలోగ్రాముల బరువు ఉండి, పొత్తికడుపుకు కుడి వైపున ఉంటుంది. వైద్య శాస్త్రంలో దీనిని మన శరీరం 'కెమికల్ ల్యాబ్' అని పిలుస్తారు. ఇది ఏకకాలంలో సుమారు 500 పైగా విధులను నిర్వర్తిస్తుంది.

కాలేయం చేసే కీలక పనులివే..

మనం తిన్న ఆహారాన్ని శక్తిగా మార్చడంలో కాలేయం ప్రధాన పాత్ర పోషిస్తుంది. కార్బోహైడ్రేట్లను గ్లూకోజ్‌గా మార్చి అవసరమైనప్పుడు వాడుకునేలా నిల్వ చేస్తుంది. రక్తంలోని హానికర రసాయనాలు, ఆల్కహాల్, మందుల తాలూకు విష పదార్థాలను వడపోసి రక్తాన్ని పరిశుభ్రంగా ఉంచుతుంది. కొవ్వు పదార్థాలను అరిగించడానికి అవసరమైన 'బైల్' అంటే పైత్యరసాన్ని ఉత్పత్తి చేస్తుంది. హార్మోన్ల సమతుల్యతను కాపాడటంతో పాటు రోగనిరోధక శక్తిని పటిష్టం చేయడంలోనూ దీనికి సాటిలేదు.

ప్రమాద ఘంటికలు..  

కాలేయం దెబ్బతిన్నప్పుడు శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుంది. వాటిని ముందే గుర్తించడం శ్రేయస్కరం. 

విపరీతమైన అలసట, నీరసం, ఆకలి మందగించడం.

కళ్లు, చర్మం పసుపు రంగులోకి మారడం (కామెర్లు).

కడుపు ఉబ్బరం లేదా నొప్పి రావడం.

చర్మంపై దురదలు, తరచూ వికారం కలగడం.

తీవ్రమైన పరిస్థితుల్లో మానసిక గందరగోళం ఏర్పడటం.

బలమైన అలవాట్లే.. ఆరోగ్యానికిరక్ష..!

"దృఢమైన అలవాట్లు,బలమైన కాలేయం" ఇది 2026 ప్రపంచ కాలేయ దినోత్సవంముఖ్య ఉద్దేశం. ఫ్యాటీ లివర్, హెపటైటిస్, సిర్రోసిస్ వంటి వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే.. సమతుల్య ఆహారం తీసుకోవడం, ఆల్కహాల్‌కు దూరంగా ఉండటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవాలి. కాలేయం ఆరోగ్యంగా ఉంటేనే.. మన జీవక్రియలు మెరుగ్గా ఉంటాయి.  

 

ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.