సాక్షి లైఫ్ : భారత్ ఇప్పటివరకు 2.2 బిలియన్ డోసుల వ్యాక్సిన్‌లను పంపిణీ చేసినప్పటికీ, బూస్టర్ టీకాల విషయంలో ప్రజల్లో నిర్లక్ష్యం కనిపిస్తోందని వైద్యనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్దవారు, ఆరోగ్య సమస్యలున్నవారు వెంటనే బూస్టర్ డోసులు తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న బూస్టర్ డోసులు లక్షణాల తీవ్రతను 50శాతం వరకు, తీవ్రమైన పరిస్థితులను 80శాతం వరకు తగ్గించగలవని వైద్యనిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..చిన్నారుల్లో జీర్ణ సమస్యలకు పరిష్కార మార్గాలు..
ఇది కూడా చదవండి..థైరాయిడ్ ఎఫెక్ట్ శరీరంపై ఎలా ఉంటుంది..?
ఇది కూడా చదవండి..ఈ డిటాక్స్ డ్రింక్స్‌తో చర్మ సౌందర్యాన్ని కాపాడుకోండి..
తీసుకోవాల్సిన సాధారణ జాగ్రత్తలు..
రద్దీ ప్రాంతాల్లో మాస్క్ ధరించడం.
చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం.
కరోనా లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే పరీక్ష చేయించుకోవడం.
ముఖ్యంగా హై-రిస్క్ గ్రూప్స్‌లో ఉన్నవారు బూస్టర్ డోసులు తప్పనిసరిగా తీసుకోవాలి.
ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా నియంత్రణలోనే ఉందని, భయపడాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు భరోసా ఇస్తున్నారు. అయినప్పటికీ, కొత్త వేరియంట్‌ల లక్షణాలను దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉండటం, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?