సూదిలేకుండానే రక్తపరీక్ష : నిలోఫర్‌ ఆసుపత్రిలో సరికొత్త ఏఐ పరికరం ప్రయోగం.. 

సాక్షి లైఫ్ : వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ, హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక నిలోఫర్‌ ప్రభుత్వ ఆసుపత్రి సరికొత్త సాంకేతికతను ఆవిష్కరించింది. దేశంలోనే తొలిసారిగా, సూదితో పొడవకుండానే రక్తపరీక్షలు చేసేందుకు ఉపయోగపడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత పీపీజీ (ఫొటో ప్లెథిస్మోగ్రఫీ) పరికరాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు.

ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

 

ఎలా పనిచేస్తుంది అంటే..?

క్విక్‌ వైటల్స్‌ సంస్థ రూపొందించిన ఈ అత్యాధునిక పరికరం, రోగి ముఖాన్ని కేవలం 30-40 సెకన్లు స్కాన్ చేస్తుంది. ఈ స్వల్ప వ్యవధిలోనే రక్తపోటు (బీపీ), ఆక్సిజన్‌ స్థాయి, గుండె లయ (హార్ట్‌బీట్‌), హిమోగ్లోబిన్‌ వంటి కీలకమైన వైటల్ సైన్స్‌ను తక్షణమే చూపించగలదు. ఇది రక్త పరీక్షల ప్రక్రియను సులభతరం చేయడమే కాకుండా, సూది అంటే భయం ఉన్న పిల్లలకు ఎంతో ఉపశమనం కలిగిస్తుంది.

ప్రయోగాత్మక పరీక్షలు.. 

ఈ పరికరం సామర్థ్యాన్ని అంచనా వేయడానికి మొదటి విడతగా వెయ్యి మంది పిల్లలపై పరీక్షలు నిర్వహించి, వాటి ఫలితాలను విశ్లేషిస్తామని నిలోఫర్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రవికుమార్‌ తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతమైతే, ఈ నూతన విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ఇది కూడా చదవండి..ప్లేట్‌లెట్ కౌంట్ ను ఎలా పెంచుకోవచ్చు..? 

ఇది కూడా చదవండి..థ్రోంబోసైట్లు అంటే ఏమిటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : pediatric-dermatology oxygen bp blood-pressure quickly hemoglobin hemoglobin-levels pediatric-health-issues medical-technology oxygen-levels niloufer-hospital niloufer-hospital-doctors pediatric-health pediatric-research healthcare-technology health-technology needle-free-blood-test ai-device photo-plethysmography-(ppg) quick-vitals vital-signs pediatric-care ai-in-healthcare
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com