ఎలాంటి ఆహారపు అలవాట్లు హైపర్‌టెన్షన్ ను నియంత్రిస్తాయి..?
సాక్షి లైఫ్ : హైపర్‌టెన్షన్ అనేది గుండెతోపాటు పలు అవయవాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కాబట్టి హైపర్‌టెన్షన్ ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తలు పాటించాలి. అందులోభాగంగా ఆహారపు అలవాట్లు, జీవనశైలి అలవాట్లను మార్చుకోవాలి. అధిక రక్తపోటు..ను హై బ్లడ్ ప్రెషర్..అని హైపర్‌టెన్షన్ అని కూడా అంటారు. ఈ సమస్య వచ్చిందంటే గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, మెదడు సంబంధిత రక్తనాళాల్లో ఇబ్బందులు వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. అధిక రక్తపోటు రాకుండా ఉండేందుకు ఏం చేయాలి..? ఏం చేస్తే అటువంటి సమస్య నుంచి బయట పడొచ్చనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..ప్లేట్‌లెట్ కౌంట్ ను ఎలా పెంచుకోవచ్చు..?
ఇది కూడా చదవండి..థ్రోంబోసైట్లు అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. ఇన్‌స్టంట్ నూడుల్స్ సైడ్ ఎఫెక్ట్స్..
ఇది కూడా చదవండి.. మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?
- వేపుడ్లు, చిప్స్, కేకులు, బిస్కెట్లు, నూడుల్స్, పిజ్జా వంటి ట్రాన్స్ క్రొవ్వు పదార్థాలను పూర్తిగా మానెయ్యాలి.
శరీర బరువును తగ్గించుకోవాలి. శరీరానికి ఒత్తిడి, తోపాటు అనవసరంగా ఆందోళన చెందకుండా ఉండాలి.
-పలురకాల అలవాట్లను మార్చుకోవడం ద్వారా హైపర్‌టెన్షన్‌ను సమస్యను నియంత్రించవచ్చు.
-వంటల తయారీలో నూనెలు, కొవ్వు పదార్థాల వినియోగం తగ్గించాలి.
మసాలాలు, కారం కూడా తక్కువగా తినాలి.
-ఉప్ప వినియోగం చాలా తగ్గించాలి.
-పొగతాగడం, మద్యం సేవించడం మానుకోవాలి.
- ప్రతినిత్యం అర్థగంటకు తక్కువ కాకుండా వ్యాయామం చేయాలి.
- అంతేకాదు నిల్వ పచ్చళ్లు, నిల్వ ఉంచిన ఆహారాలు, బేకరీ ఐటమ్స్, పచ్చళ్లు, అప్పడాలు, క్యాన్డ్ ఫుడ్స్ పూర్తిగా తగ్గించాలి.
ఇది కూడా చదవండి..ప్లేట్‌లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..అల్జీమర్స్ కు చికిత్స ఏమిటి..?
ఇది కూడా చదవండి.. జ్ఞాపకశక్తి తగ్గుతోందా..? అయితే అది ఈ జబ్బుకు సంకేతం కావచ్చు..
ఇది కూడా చదవండి.. చిన్న వయసులో కూడా అల్జీమర్స్ సమస్య వస్తుందా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
