Weight loss Tips : బరువు తగ్గించే ‘ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్’.. లాభాలు-నష్టాలు..?
సాక్షి లైఫ్ : ఫిట్‌నెస్ ప్రపంచంలో ప్రస్తుతం బాగా వినిపిస్తున్న పేరు ‘ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్’ (Intermittent Fasting). బరువు తగ్గాలనుకునే వారికి, బాడీ షేప్ మార్చుకోవాలనుకునే వారికి ఇది ఒక ట్రెండ్‌గా మారింది. అయితే, చాలామంది భావిస్తున్నట్లుగా ఇది ఒక డైట్ ప్లాన్ (diet plan) కాదు, ఇదొక ప్రత్యేకమైన తినే విధానం. అంటే.. నిర్దిష్ట సమయం పాటు ఉపవాసం ఉండి, ఆ తర్వాత ఒక క్రమ పద్ధతిలో ఆహారం తీసుకోవడం.
శరీర జీవక్రియను (Metabolism) మెరుగుపరిచే ఈ పద్ధతి అందరికీ ఒకేలా ఉపయోగపడకపోవచ్చు. దీనిని సరైన అవగాహన లేకుండా పాటిస్తే బలహీనత, అలసట వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ నేపథ్యంలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలు మరియు పాటించాల్సిన సరైన పద్ధతులను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల కలిగే లాభాలు..
బరువు నియంత్రణ..ఇది శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించి, బరువు తగ్గడానికి అద్భుతంగా సహాయపడుతుంది. మెరుగైన జీవక్రియ..శరీర మెటబాలిజం రేటు పెరిగి, తిన్న ఆహారం శక్తిగా మారుతుంది. ఇన్సులిన్ సున్నితత్వం..రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరించడంలో, ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడంలో తోడ్పడుతుంది.
బాడీ డిటాక్సిఫికేషన్..ఉపవాస సమయంలో శరీరం తనను తాను శుభ్రపరుచుకునే నిర్విషీకరణ ప్రక్రియ వేగవంతం అవుతుంది. మానసిక ఏకాగ్రత..శరీరంలో శక్తి స్థాయిలు పెరగడంతో పాటు రోజంతా చురుగ్గా, ఏకాగ్రతతో ఉండేందుకు దోహదం చేస్తుంది.
తప్పుగా పాటిస్తే వచ్చే నష్టాలు..
ప్రారంభ దశలో విపరీతమైన నీరసం, అలసట వేధించవచ్చు.కొందరిలో తలనొప్పి, చిరాకు వంటి లక్షణాలు కనిపిస్తాయి.ఎక్కువ సమయం ఉపవాసం ఉన్న తర్వాత, తినే సమయంలో (Eating Window) ఒకేసారి అతిగా తినేసే (Binge eating) ప్రమాదం ఉంది.
ఫాస్టింగ్ చేసేటప్పుడు పాటించాల్సిన 4 ముఖ్యమైన సూత్రాలు..
16:8 లేదా 14:10 పద్ధతితో ప్రారంభించాలి..ఈ విధానంలో అత్యంత ప్రజాదరణ పొందింది 16:8 పద్ధతి. అంటే 16 గంటల పాటు ఉపవాసం ఉండి, మిగిలిన 8 గంటల వ్యవధిలో ఆహారం తీసుకోవడం. అయితే, కొత్తగా ప్రారంభించేవారు అకస్మాత్తుగా ఎక్కువ గంటలు ఉపవాసం ఉండటం వల్ల తలతిరగడం, నీరసం రావచ్చు. కాబట్టి, మొదట్లో 14:10 పద్ధతి 14 గంటల ఉపవాసం, 10 గంటల తినే సమయంతో ప్రారంభించి, శరీరం అలవాటు పడ్డాక ఉపవాస సమయాన్ని పెంచడం ఉత్తమం.
2. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి..
ఉపవాస సమయంలో శరీరం డీహైడ్రేషన్ అవ్వకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం పుష్కలంగా నీరు తాగాలి. ఆకలిని నియంత్రించుకోవడానికి, జీవక్రియను చురుగ్గా ఉంచడానికి చక్కెర లేని హెర్బల్ టీ లేదా బ్లాక్ కాఫీ వంటివి తీసుకోవచ్చు.
3. జంక్ ఫుడ్‌కు పూర్తిగా దూరం..
ఉపవాస సమయం ముగిసిన తర్వాత తినే ఆహారమే అత్యంత కీలకం. ఫాస్టింగ్ అయిపోయింది కదా అని జంక్ ఫుడ్, నూనెలో వేయించిన పదార్థాలు, స్వీట్లు, బేకరీ ఫుడ్స్ తింటే ఉపవాసం వల్ల వచ్చే ప్రయోజనాలన్నీ బూడిదలో పోసిన పన్నీరవుతాయి.
4. పోషకాలతో కూడిన సమతుల్య ఆహారం..
తినే సమయంలో శరీరానికి అవసరమైన ప్రొటీన్లు, పీచు పదార్థం, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు అందేలా చూసుకోవాలి. మీ డైట్‌లో ఆకు కూరలు, తాజా పండ్లు, పప్పుధాన్యాలు, డ్రై ఫ్రూట్స్ , తృణధాన్యాలను చేర్చుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పూర్తి శక్తి లభించి, నీరసం రాకుండా ఉంటుంది. ఏదైనా కొత్త జీవనశైలిని లేదా ఉపవాస పద్ధతిని ప్రారంభించే ముందు, ముఖ్యంగా మధుమేహం, బీపీ లేదా ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఖచ్చితంగా నిపుణులైన వైద్యులను లేదా డైటీషియన్‌ను సంప్రదించాలి.
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..?
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
