మధుమేహానికి ప్రత్యామ్నాయంగా బెల్లం, తేనె లేదా స్టెవియాలను వాడొచ్చా..?

షేర్ చేయండి:
మధుమేహానికి ప్రత్యామ్నాయంగా బెల్లం, తేనె లేదా స్టెవియాలను వాడొచ్చా..?

సాక్షి లైఫ్ : మధుమేహం ఉన్నవారు ప్రతిరోజూ తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులోభాగంగా చక్కెరను దూరం పెట్టాలి. అయితే, తీపిని పూర్తిగా వదిలేయడం చాలామందికి కష్టం. అలాంటి వారు చక్కెర బదులుగా వేటిని ఉపయోగించవచ్చనే సందేహం సర్వసాధారణం. బెల్లం, తేనె, స్టెవియా వంటి వాటిలో ఏది ఉత్తమమో ఇప్పుడు తెలుసుకుందాం..

 

ఇది కూడా చదవండి.. స్మోకింగ్ అలవాటు లేనివారు లంగ్ క్యాన్సర్‌ బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు అవసరం..? 

ఇది కూడా చదవండి.. మ‌తిమ‌రుపునకు చికిత్స సాధ్య‌మేనా..?

ఇది కూడా చదవండి.. సికిల్ సెల్ వ్యాధి అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి.. శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల క్యాన్సర్ వస్తుందా..?

 

బెల్లం: బెల్లం మన సాంప్రదాయ తీపి పదార్థం. దీనిలో ఐరన్, మినరల్స్ వంటి పోషకాలు ఉంటాయి. కానీ, బెల్లంలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ అధికంగా ఉంటాయి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. కాబట్టి, మధుమేహం ఉన్నవారు బెల్లాన్ని అధికంగా తీసుకోవడం మంచిది కాదు.

తేనె: తేనె సహజంగా లభించే మరో తీపి పదార్థం. దీనిలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీమైక్రోబియల్ గుణాలు ఉన్నాయి. కానీ, తేనెలో కూడా చక్కెర శాతం ఎక్కువే. ఇది కూడా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది. కాబట్టి, మధుమేహం ఉన్నవారు తేనెను కూడా మితంగానే తీసుకోవాలి.

స్టెవియా: స్టెవియా అనేది ఒక మొక్క నుంచి లభించే తీపి పదార్థం. దీనిలో క్యాలరీలు ఉండవు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేయదు. స్టెవియాను తక్కువ మొత్తంలో వాడితేనే అధిక తీపి వస్తుంది. ఇది మధుమేహం ఉన్నవారికి ఒక సురక్షితమైన ప్రత్యామ్నాయం.

వైద్య నిపుణులు ఏమంటున్నారు..? 

మధుమేహం ఉన్నవారు చక్కెర బదులు ఏ ప్రత్యామ్నాయాన్ని ఎంచుకున్నా, డాక్టర్ లేదా డైటీషియన్ సలహా తీసుకోవాలి. ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి శరీర తత్వం వేర్వేరుగా ఉంటుంది, కాబట్టి వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితిని బట్టి ఏది ఉత్తమమో తెలుసుకోవాలి.

 

ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి.. నల్ల ఉప్పుతో ఆరోగ్య ప్రయోజనాలివే 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.