సాక్షి లైఫ్: లంగ్ క్యాన్సర్ కేవలం పొగతాగేవారికి మాత్రమే వస్తుందని చాలామంది భావిస్తారు. కానీ, ధూమపానం చేయని వారికి కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సెకండ్ హ్యాండ్ స్మోక్, వాయు కాలుష్యం, ఆస్బెస్టాస్ వంటి రసాయనాలకు గురికావడం, జన్యుపరమైన కారణాలు ఇలా అనేక అంశాలు ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కారణం కావచ్చు.
ఇది కూడా చదవండి..లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
స్మోకింగ్ అలవాటు లేనివారు కూడా లంగ్ క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి అందరూ తెలుసుకోవాలి.. 6 చిట్కాలను పాటించడం ద్వారా మీ ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
-కాలుష్యానికి దూరంగా ఉండండి: ముఖ్యంగా వాహనాల నుంచి వచ్చే పొగ, ఫ్యాక్టరీల నుంచి వచ్చే కాలుష్యం ఊపిరితిత్తులకు చాలా హానికరం. ఇంట్లో కూడా బయోమాస్ ఫ్యూయల్స్ (కట్టెలు, బొగ్గు) వాడకాన్ని తగ్గించాలి. గాలి కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బయటికి వెళ్లినప్పుడు మాస్క్ ధరించడం మంచిది.
-సెకండ్ హ్యాండ్ స్మోక్ నివారించండి: స్మోకింగ్ చేసే వారి దగ్గర ఉండకుండా జాగ్రత్తపడండి. పరోక్షంగా పొగ పీల్చడం కూడా లంగ్ క్యాన్సర్‌కి ప్రధాన కారణం.
-రసాయనాల నుంచి రక్షణ: మీరు పని చేసే చోట ఆస్బెస్టాస్, డీజిల్ ఎగ్జాస్ట్ వంటి క్యాన్సర్ కారకాలకు గురయ్యే అవకాశం ఉంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రక్షణ మాస్కులు, గ్లౌజులు ధరించడం తప్పనిసరి.
-ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి: పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి.
-క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి: నిత్యం వ్యాయామం చేయడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. శ్వాసకోశ కండరాలు బలంగా తయారవుతాయి. యోగా, వాకింగ్, శ్వాస సంబంధిత వ్యాయామాలు చాలా మేలు చేస్తాయి.
-శరీర భంగిమ సరిగా ఉండాలి: కూర్చున్నప్పుడు, నిల్చున్నప్పుడు మీ శరీర భంగిమ సరైన రీతిలో ఉందో లేదో చూసుకోండి. వంగి కూర్చోవడం వల్ల ఊపిరితిత్తులు పూర్తిగా విస్తరించలేవు. దీనివల్ల శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది.
ఈ చిట్కాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. మీకు ఏవైనా లక్షణాలు కనిపిస్తే లేదా ఊపిరితిత్తులకు సంబంధించి సమస్యలు ఉన్నట్లు అనుమానం వస్తే వెంటనే వైద్య నిపుణుడిని సంప్రదించి సలహా తీసుకోవాలి. త్వరగా వ్యాధిని గుర్తించడం వల్ల చికిత్స సులభమవుతుంది.
ఇది కూడా చదవండి.. సికిల్ సెల్ డిసీజ్ లక్షణాలు ఎలా వుంటాయి..?
ఇది కూడా చదవండి.. వరల్డ్ సికిల్ సెల్ డే చరిత్ర, ప్రాముఖ్యత..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com