శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల క్యాన్సర్ వస్తుందా..? 

షేర్ చేయండి:
శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల క్యాన్సర్ వస్తుందా..? 

సాక్షి లైఫ్ : ప్రస్తుతం మనకు మార్కెట్ లో అందుబాటులో ఉన్న అన్నిరకాల రకాల శానిటరీ ప్యాడ్ల తయారీలో ఎక్కువగా థాలేట్స్, కర్బన సమ్మేళనాలు వొలాటైల్ ఆర్గానిక్ కంపౌండ్స్ వంటి విషపూరితమైన కెమికల్స్ ను వినియోగిస్తున్నారు. ఎక్కువరోజులు చెక్కుచెదరకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో పలు శానిటరీ ప్యాడ్స్ తయారీ సంస్థలు థాలేట్స్‌ ను మిక్స్ చేస్తున్నాయి. థాలేట్స్ యుక్తవయస్సులో శరీరంలో మార్పులను ప్రేరేపిస్తాయి.

ఇది కూడా చదవండి.. పీరియడ్స్ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరం..?

అంతేకాదు వీటి కారణంగా క్యాన్సర్, సంతానోత్పత్తి విషయంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ (ఎన్‌సీబీఐ) చెబుతోంది. మరోపక్క శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం లేదని, కానీ కొన్నిసార్లు ఫంగల్ ఇన్‌ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుందని, అందుకే నెలసరి సమయంలో మెన్ట్రువల్ కప్స్ వినియోగించమని గైనకాలజిస్టులు చెబుతున్నారు.

 ఇది కూడా చదవండి..డెంగ్యూ సమయంలో ప్లేట్‌లెట్ల కౌంట్ ను ఎలా పెంచాలి..? 

గత 40 ఏళ్ల క్రితం చాలా మంది మెత్తటి చీరలను లేదా పంచలను ఇందుకోసం ఉపయోగించేవాళ్లు. అవి కూడా ఎక్కువ కాలం వాడకూడదు. ఎందుకంటే బ్యాక్టిరియల్ ఇన్‌ఫెక్షన్స్, ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది.  పలు ఎంజీవో సంస్థలు  క్లాత్ తో తయారు చేసిన శానిటరీ నాప్కిన్స్‌ను అందిస్తున్నాయి. అటువంటివాటివల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని డాక్టర్లు వెల్లడిస్తున్నారు. 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

ఇది కూడా చదవండి.. 30 ఏళ్ల తర్వాత శరీరానికి కొల్లాజెన్ ఎందుకు ముఖ్యమంటే..?

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.