Is Protein Dangerous for Liver : కాలేయ క్యాన్సర్ రోగులకు 'ప్రొటీన్' ముప్పు..? అమ్మోనియా పెరుగుదలే కారణం..
సాక్షి లైఫ్ : ఆహారంలోని ప్రొటీన్లు శరీరానికి శక్తినిస్తాయి. కానీ, కాలేయ వ్యాధులతో బాధపడేవారికి ఇవే ప్రొటీన్లు శాపంగా మారుతున్నాయా..? అంటే అవుననే అంటున్నాయి తాజా పరిశోధనలు. కాలేయ వ్యాధులున్న వారు ప్రొటీన్ ఆహారాన్ని తగ్గించడం వల్ల క్యాన్సర్ గడ్డల (Tumours) పెరుగుదలను నియంత్రించవచ్చని 'సైన్స్ అడ్వాన్సెస్' పత్రికలో ప్రచురితమైన ఒక అధ్యయనం వెల్లడించింది.
అమ్మోనియా..
సాధారణంగా మనం ప్రొటీన్ తిన్నప్పుడు శరీరంలో అమ్మోనియా ఉత్పన్నమవుతుంది. ఆరోగ్యవంతుల్లో కాలేయం ఈ అమ్మోనియాను 'యూరియా'గా మార్చి శరీరం నుంచి బయటకు పంపిస్తుంది. అయితే హెపటైటిస్, ఫ్యాటీ లివర్ లేదా కాలేయ క్యాన్సర్ ఉన్నవారిలో ఈ ప్రక్రియ మందగిస్తుంది. కాలేయం అమ్మోనియాను బయటకు పంపలేకపోవడంతో, అది రక్తంలో, కాలేయ కణజాలంలో పేరుకుపోతుంది.
ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?
ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
పేరుకుపోయిన ఈ అమ్మోనియాను క్యాన్సర్ కణాలు తమ ఎదుగుదలకు అవసరమైన 'నత్రజని' (Nitrogen) వనరుగా వాడుకుంటున్నాయి. తద్వారా డి.ఎన్.ఏ (DNA) తయారీని వేగవంతం చేసి, కణితులు వేగంగా పెరిగేలా చేస్తున్నాయని పరిశోధకులు గుర్తించారు.
తక్కువ ప్రొటీన్..
రట్జర్స్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. క్యాన్సర్ ఉన్న ఎలుకలకు తక్కువ ప్రొటీన్ ఉన్న ఆహారాన్ని అందించగా, వాటిలో అమ్మోనియా ఉత్పత్తి తగ్గింది. దీనివల్ల క్యాన్సర్ గడ్డల పెరుగుదల వేగం తగ్గడమే కాకుండా, ఆ ఎలుకలు ఎక్కువ కాలం జీవించాయి. అమ్మోనియాను శుద్ధి చేసే ఎంజైమ్‌లు సరిగ్గా పనిచేయకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తుతోందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.
అందరికీ వర్తించదు..
ఈ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ, క్యాన్సర్ రోగులందరూ వెంటనే ప్రొటీన్ తగ్గించకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్యాన్సర్ చికిత్స పొందుతున్న వారు కండరాల శక్తి కోసం ప్రొటీన్ తీసుకోవడం చాలా ముఖ్యం. ఆహారంలో మార్పులు చేసే ముందు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలి. అతిగా ప్రొటీన్ తగ్గించడం వల్ల రోగి నీరసించిపోయే ప్రమాదం ఉందని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
కాలేయ వ్యాధులు ఉన్నవారు అమ్మోనియా స్థాయిలను అదుపులో ఉంచుకోవడం ద్వారా క్యాన్సర్ ముప్పును తగ్గించవచ్చని ఈ పరిశోధన నిరూపిస్తోంది. ప్రస్తుతం ఇవి ఎలుకలపై జరిపిన ప్రయోగాలు మాత్రమే కాబట్టి, మనుషులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాక పూర్తిస్థాయి మార్గదర్శకాలు వెలువడే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
