జికా వైరస్ గర్భిణీలకు,చిన్నారులకు ప్రమాదకరమా..?

షేర్ చేయండి:
జికా వైరస్ గర్భిణీలకు,చిన్నారులకు ప్రమాదకరమా..?

సాక్షి లైఫ్ : గర్భధారణ సమయంలో జికా వైరస్ ఇన్ఫెక్షన్ ఆందోళన కలిగించే అంశమని, ఎందుకంటే ఇది కొంతమంది శిశువుల్లో మైక్రోసెఫాలీ ,ఇతర మెదడు వైకల్యాలకు కారణమవుతుందని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. పెద్దవారిలో ఇది గులియన్ బారే సిండ్రోమ్(జీబీఎస్)తో ముడిపడి ఉందిశరీరంలోని కణాలను ప్రభావితం చేస్తుందన ఇవ్వరు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి..జికా వైరస్ డెంగ్యూ జ్వరాన్ని పోలి ఉంటుందా..?

 

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు

జికా వైరస్ రాకుండా ఉండాలంటే..?

జికా వైరస్ రాకుండా ఉండాలంటే..? దోమలను నివారించడం చాలా అవసరమని డాక్టర్లు అంటున్నారు. ఇప్పటికీ ఇంకా దీనికి ఎలాంటి వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. దోమల నివారణ ఒక్కటే ప్రధాన పరిష్కారమని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి జనాలు నివసించే ప్రాంతంలో దోమలను నివారించాలని, శరీరాన్ని ఎక్కువ భాగం బట్టలతో  కప్పుకోవాలని, దోమతెరలు వాడడం వంటి చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తున్నారు. దోమలు పెరిగే ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా ఉండేలా చూడాలని వైద్యులు చెబుతున్నారు.

క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడంతో పాటు మంచి ఆహారాన్ని తినాలని, రోజువారీ ఆహారంలో పోషకాలు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను చేర్చుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుందని తద్వారా కొన్నిరకాల వైరస్ ల నుంచి దూరంగా ఉండొచ్చని డాక్టర్లు వెల్లడిస్తున్నారు. 

ఇది కూడా చదవండి.. 30 ఏళ్ల తర్వాత శరీరానికి కొల్లాజెన్ ఎందుకు ముఖ్యమంటే..?

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.