జికా వైరస్ డెంగ్యూ జ్వరాన్ని పోలి ఉంటుందా..?

సాక్షి లైఫ్ : మహారాష్ట్రలోని పూణెలో జికా వైరస్ కారణంగా ఇటీవల ఐదుగురు మరణించారు. ఈ సందర్భంగా జికా వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయి..? ఎలాంటి లక్షణాలను బట్టి జికా వైరస్ ఉందని నిర్ధారించవచ్చు..? అనేదాని గురించి పరిశోధకులు పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. దీనిపై అధ్యయనం చేసిన తర్వాత జికా వైరస్ కు సంబంధించి ఎటువంటి లక్షణాలు లేవని, ఇది డెంగ్యూ జ్వరాన్ని పోలి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జికా వైరస్ అనేది దోమల ద్వారా సంక్రమించే వ్యాధి. ఇది ఏడిస్ దోమల ద్వారా వ్యాపిస్తుందని వారు వెల్లడించారు. ఈ దోమ డెంగ్యూ, చికున్‌గున్యా, ఎల్లో ఫీవర్‌ని కూడా వ్యాపింపజేస్తుంది.

ఈ లక్షణాలు ఉండవచ్చు.. 

ఇది సాధారణంగా పగటిపూట కుడుతుంది. పెద్దలలో తక్కువ తీవ్రత కలిగిన వ్యాధిగా పరిగణిస్తారు. దీని సాధారణ లక్షణాలు తేలికపాటి జ్వరం, దద్దుర్లు, తలనొప్పి, కండరాలు, కీళ్ల నొప్పి , కనురెప్పల కింద వాపు. ఈ లక్షణాలు సాధారణంగా 2 నుంచి 7 రోజుల వరకూ ఉంటాయి.

సుమారు 80 శాతం కేసులలో, లక్షణాలు కనిపించవు, కానీ డెంగ్యూ జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. జ్వరం, కళ్ళు ఎర్రబడడం, కీళ్ల నొప్పి , తలనొప్పి, అలెర్జీ వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. 

 డెంగ్యూ మాదిరిగా, జికా వైరస్ కేసులు పెరగడానికి అనేక అంశాలు కారణమని, వీటిలో వాతావరణంలో ఆకస్మిక మార్పులు, మురికి నీరు ఇళ్ల  చుట్టూ చేరడం వల్ల దోమలు పెరగడం అవి కుట్టడం ద్వారా ఎలాంటి తీవ్రమైన వైరస్ వస్తుందని వైద్యనిపుణులు అంటున్నారు.  

ఇది కూడా చదవండి.. డెంగ్యూ, మలేరియాలకు దివ్యౌషధం ఈ ఆకు..

 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

ఇది కూడా చదవండి.. బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా క్యాన్సర్ రావడానికి కారణాలేంటి..?   

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : diseases seasonal-health-issues zika-virus dengue dengue-fever rainy-season rain-season dengue-cases monsoons-season zika-virus-symptoms
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com