జుట్టు రాలడానికి ప్రధాన కారణాలు..? 

షేర్ చేయండి:
జుట్టు రాలడానికి ప్రధాన కారణాలు..? 

సాక్షి లైఫ్ : పెరుగుతున్న జుట్టు రాలడం సమస్యను నియంత్రించడానికి ఆయిల్, షాంపూ వంటివి వాడుతూ.. మరికొన్ని చిట్కాలను పాటిస్తుంటారు. ఐతే అటువంటివాటిలో కొన్ని పరిష్కారాలు పని చేస్తాయి. మరికొన్ని పని చేయకపోవచ్చు. అసలు జుట్టు రాలు సమస్యకు ప్రధాన కారణాలు ఏంటి..? 

పురుషుల కంటే మహిళలకు.. 

జుట్టు రాలడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. హెయిర్ ఫాల్ ప్రాబ్లెమ్ అనేది మహిళలు, పురుషుల్లోనూ సర్వసాధారణంగా తలెత్తుతుంది. పురుషుల కంటే మహిళలకు జుట్టు పొడవుగా ఉంటుంది. అందుకే వారి జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. కానీ జుట్టు పురుషులు, స్త్రీలలో సమాన నిష్పత్తిలో పెరుగుతుంది. కానీ బట్టతల సమస్య స్త్రీలలో కంటే పురుషులలో ఎక్కువగా కనిపిస్తున్నట్లు అధ్యనాలు వెల్లడిస్తున్నాయి.

హార్మోన్ల మార్పుల వల్ల కూడా.. 

ఏ వ్యక్తిలోనైనా జుట్టు రాలడానికి ప్రధానంగా నాలుగు కారణాలున్నాయి. మొదటి కారణం హార్మోన్ల మార్పులు.. హెయిర్ ఫాల్ అనేది హార్మోన్ల మార్పుల వల్ల కూడా తలెత్తుతుందని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.  రెండవది కొన్ని తీవ్రమైన వ్యాధులు లేదా వైద్య పరిస్థితుల కారణంగా కూడా జుట్టు రాలడం జరుగుతుంది. 

పోషకాహార లోపం వల్ల.. 

మూడవది వంశపారంపర్యంగా కూడా హెయిర్ ఫాల్ సంభవిస్తుందని డాక్టర్లు అంటున్నారు. నాల్గవ కారణం వయస్సు పెరగడంతో చాలామంది శారీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. అందులో భాగంగా జుట్టు రాలుతుందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. మరికొందరిలో పోషకాహార లోపం వల్ల హెయిర్ ఫాల్ సమస్య తలెత్తవచ్చని వారు చెబుతున్నారు.   

 గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.